Jagga Reddy | శ్రీరామున్ని ఓ పార్టీకి లీడర్‌ని చేశారు
కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి
విధాత: ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డపై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. శుక్రవారం నిర్వహిచిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కూలాలు, మతాలతో కలిసిన సెక్యూలర్ పార్టీ అన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ బీసీ అయినప్పటీకీ అన్ని కూలాల మద్ధతు అవసరమన్నారు.
మెదక్ ఎన్నికలో పోరులో బీఆరెస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది, వేరే పార్టీకి అవకాశం లేదన్నారు. రాముడు దేవుడు కానీ ఆయన్ని ఓ పార్టీకి లీడర్‌ను చేశారని ఎద్దేవా చేశారు. మెదక్ పార్లమెంట్ మొదట బాగారెడ్డి నియోజకవర్గం ఆ తరువాత ఇక్కడి నుంచి ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారన్నారు. గజ్వెల్, సిద్ధిపేట, దుబ్బాకలో కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలని కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram