Jagityala: కడుపులో క్లాత్ వదిలిన ఘటన.. త్రీ మెన్ కమిటీ విచారణ

సంవ‌త్స‌రం పైగా అవ‌స్థ‌లు ప‌డిన బాధితురాలు వైద్యులను ప్రశ్నించిన కమిటీ అధికారులు రికార్డుల పరిశీలన విధాత, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ మ‌హిళ‌కు ఆపరేషన్ సమయంలో కడుపులో కాటన్ క్లాత్ వదిలి కుట్లు వేసిన ఘటనపై బుధ‌వారం త్రీ మెన్ కమిటీ విచారణ చేప‌ట్టింది. విచారణలో భాగంగా వేములవాడలో బాధితురాలు నవ్యశ్రీ కడుపులో నుండి కాటన్ క్లాత్ బయటకు తీసిన వైద్యురాలిని క‌మిటీ స‌భ్యులు విచారించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని […]

Jagityala: కడుపులో క్లాత్ వదిలిన ఘటన.. త్రీ మెన్ కమిటీ విచారణ
  • సంవ‌త్స‌రం పైగా అవ‌స్థ‌లు ప‌డిన బాధితురాలు
  • వైద్యులను ప్రశ్నించిన కమిటీ అధికారులు
  • రికార్డుల పరిశీలన

విధాత, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ మ‌హిళ‌కు ఆపరేషన్ సమయంలో కడుపులో కాటన్ క్లాత్ వదిలి కుట్లు వేసిన ఘటనపై బుధ‌వారం త్రీ మెన్ కమిటీ విచారణ చేప‌ట్టింది.

విచారణలో భాగంగా వేములవాడలో బాధితురాలు నవ్యశ్రీ కడుపులో నుండి కాటన్ క్లాత్ బయటకు తీసిన వైద్యురాలిని క‌మిటీ స‌భ్యులు విచారించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో రికార్డుల పరిశీలన, ఆపరేషన్ చేసింది ఎవరనే దాని పై త్రీ మెన్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ పురుడు కోసం జగిత్యాలలోని తన తల్లి గారి ఇంటికి వచ్చింది. 2021 డిసెంబర్‌లో పురుడు కోసం ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.
ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఇటీవల బయటపడింది.

ఆపరేషన్ జరిగిన నాటి నుండి నవ్యశ్రీ కడుపు నొప్పితో బాధపడుతున్న‌ది. అయితే ఆప‌రేష‌న్ సాధార‌ణ‌మే అని అనుకున్నారు. కానీ సంవ‌త్స‌రం దాటినా నొప్పి త‌గ్గ‌క‌పోవ‌డంతో, కుటుంబ సభ్యులు ఆమెను వేములవాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయడంతో కడుపులో కాటన్ క్లాత్ ఉన్న విషయం బయటపడింది. దీంతో వారు ఆపరేషన్ నిర్వహించి కాటన్ క్లాత్ వెలికి తీశారు.

వైద్యుల నిర్లక్ష్యంపై నవ్య శ్రీ తల్లిదండ్రులు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లు, అసిస్టెంట్లు ఆనాటి రికార్డుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా త్రీ మెన్ కమిటీ సభ్యులు బుధవారం విచారణ జరిపారు.