Jai Hanuman | శ్రీరామ నవమి రోజున జై హనుమాన్ అదిరిపోయే అప్‌డేట్‌

శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మూవీ డైరక్టర్ ప్రశాంత్‌వర్మ సీక్వెల్‌ జై హనుమాన్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు

  • Publish Date - April 17, 2024 / 02:59 PM IST

రాముడికి ఆంజనేయుడి అభయంతో పోస్టర్

విధాత : శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మూవీ డైరక్టర్ ప్రశాంత్‌వర్మ సీక్వెల్‌ జై హనుమాన్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. రాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లుగా ఓ పోస్టర్ డిజైన్ చేసి శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసారు. ఒకప్పుడు త్రేతాయుగంలో ఒక భయంకరమైన వాగ్దానం చేయబడిందని, అది కలియుగంలో రక్షించబడుతుందని చిత్ర యూనిట్ పోస్టర్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుండగా, జై హనుమాన్‌పై మరిన్ని అంచనాలు పెంచేసింది. జై హనుమాన్ సినిమాలో ఈసారి విజువల్స్ మరింత అద్భుతంగా ఉండనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేసాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీరాముడి దీవేనలతో మీకు ఇంతకుముందెన్నడూ లేని అనుభవాన్ని ఈ సినిమాతో అందించబోతున్నామని , ఇది మనందరికి ఎంతో ప్రత్యేకమైన సినిమా అని పోస్టు చేశారు. దర్శకుడు ప్రశాంత్‌వర్మ రూపొందించగా..టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్‌ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ మూవీ ఎండింగ్ లోనే సీక్వెల్ కి దర్శకుడు లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ అంటూ సీక్వెల్ ని ప్రేక్షకులముందుకు తీసుకు రాబోతున్నారు. జై హనుమాన్ మూవీ ఈ సారి మరింత అద్భుతంగా తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తన పోస్టులో స్పష్టం చేసి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు.

Latest News