Adipurush | ఆదిపురుష్ సినిమాకు అనూహ్య అతిథి.. థియేట‌ర్‌లో సినిమా చూసిన వానరం

Adipurush | వాన‌రుడి రూపంలో హ‌నుమంతుడే వ‌చ్చాడ‌ని అభిమానుల కేరింత‌లు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో విధాత‌: నాగుల చ‌వితి నాడు నాగుపాము శివ‌లింగం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన ఘ‌ట‌న‌లు గ‌తంలో వెలుగుచూశాయి. శివ‌రాత్రి రోజు శివుడి విగ్ర‌హం మెడ‌ చుట్టూ పాము చుట్టుకున్న వీడియోలు గ‌తంలో మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అదే త‌ర‌హాలో శుక్ర‌వారం విడుద‌లైన ఆదిపురుష్ సినిమా థియేట‌ర్‌లో ఓ వాన‌రం ప్ర‌త్య‌క్ష‌మైంది. కొద్దిసేపు ఆ సినిమా కూడా చూసింది. రామాయ‌ణం నేప‌థ్యంలో భారీ […]

  • By: krs    latest    Jun 16, 2023 2:47 PM IST
Adipurush | ఆదిపురుష్ సినిమాకు అనూహ్య అతిథి.. థియేట‌ర్‌లో సినిమా చూసిన వానరం

Adipurush |

  • వాన‌రుడి రూపంలో హ‌నుమంతుడే వ‌చ్చాడ‌ని అభిమానుల కేరింత‌లు
  • సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో

విధాత‌: నాగుల చ‌వితి నాడు నాగుపాము శివ‌లింగం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన ఘ‌ట‌న‌లు గ‌తంలో వెలుగుచూశాయి. శివ‌రాత్రి రోజు శివుడి విగ్ర‌హం మెడ‌ చుట్టూ పాము చుట్టుకున్న వీడియోలు గ‌తంలో మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

అదే త‌ర‌హాలో శుక్ర‌వారం విడుద‌లైన ఆదిపురుష్ సినిమా థియేట‌ర్‌లో ఓ వాన‌రం ప్ర‌త్య‌క్ష‌మైంది. కొద్దిసేపు ఆ సినిమా కూడా చూసింది.

రామాయ‌ణం నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్‌లో ఈ సినిమాను రూపొందించారు. శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌లైంది. ఉద‌యం ఆరుగంట‌ల నుంచే షోలు మొద‌ల‌య్యాయి.

ఆదిపురుష్ సినిమాను ఫ‌స్ట్ రోజు, ఫ‌స్ట్ షో చూడాల‌ని ఉత్సాహ ప‌డింది కావ‌చ్చు.. ఓ కోతి ఫ‌స్ట్‌లో ప్ర‌త్య‌క్షమైంది. గోడ‌పై కూర్చొని కొద్దిసేపు సినిమాను తిల‌కించింది. ఈ ఘ‌ట‌న‌లో న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్‌లో చోటుచేసుకున్న‌ది.