Jailer | జైలర్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. ఓటీటీలో రిలీజ్‌కి టైం ఫిక్స్
Jailer | దాదాపు మూడేళ్ల తర్వాత రజనీకాంత్ జైలర్ అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. రజినీకాంత్ స్టైల్, యాక్షన్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా చక్కగా కుదరడంతో జైలర్ మూవీ దాదాపు ఆరు వందలకి పైగా కలెక్షన్స్ సాధించింది. రజనీకాంత్ వలనే ఇంత మంచి విజయం దక్కిందని నిర్మాత ఖరీదైన కారుని కూడా […]

Jailer |
దాదాపు మూడేళ్ల తర్వాత రజనీకాంత్ జైలర్ అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. రజినీకాంత్ స్టైల్, యాక్షన్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా చక్కగా కుదరడంతో జైలర్ మూవీ దాదాపు ఆరు వందలకి పైగా కలెక్షన్స్ సాధించింది.
రజనీకాంత్ వలనే ఇంత మంచి విజయం దక్కిందని నిర్మాత ఖరీదైన కారుని కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన వారికి ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశాన్ని కలిగించారు మేకర్స్. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోకి సెప్టెంబర్ 7వ తేదీన రానుంది.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల (సెప్టెంబర్) 7వ తేదీన జైలర్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుందని ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్‌లో జైలర్ మూవీ వస్తుందని ఆ మధ్య జోరుగా ప్రచారాలు సాగాయి. అయితే వాటన్నింటిని కొట్టేస్తూ.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని అధికారిక ప్రకటన చేసింది. దీంతో సినిమాని చూసేందుకు చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో తమన్నా , కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించాడు. రమ్యకృష్ణ కూడా ఓ పాత్రలో మెరిసి సందడి చేసింది. ఇక ఈ చిత్రం సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 200కోట్ల బడ్జెట్‌తో జైలర్ సినిమాను నిర్మించగా, లాభాలు అంతకు మించి రావడంతో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.