Janagama | జనగామ మార్కెట్‌ నూతన కమిటీ నియామకం

చైర్మన్‌గా బాల్దె సిద్దిలింగం ఎంపిక విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల కాలంగా ఎదురు చూస్తున్న జనగామ వ్యవసాయ మార్కెట్ (Janagama Agricultural Market) నూతన కమిటీని ఎట్టకేలకు నియమించారు. ప్రస్తుతం మార్కెట్ సీజన్ కావడంతో ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పెంబర్తికి చెందిన బాల్దె సిద్దిలింగం (Balde Siddilingam) ను, వైస్‌ చైర్మన్‌గా ముసిపట్ల విజయ్‌కుమార్ (Musipatla Vijaykumar), మరో 17 మందితో కూడిన కమిటీని నియమించారు. ఈ మేరకు […]

  • By: Somu |    latest |    Published on : Mar 15, 2023 6:40 AM IST
Janagama | జనగామ మార్కెట్‌ నూతన కమిటీ నియామకం
  • చైర్మన్‌గా బాల్దె సిద్దిలింగం ఎంపిక

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల కాలంగా ఎదురు చూస్తున్న జనగామ వ్యవసాయ మార్కెట్ (Janagama Agricultural Market) నూతన కమిటీని ఎట్టకేలకు నియమించారు. ప్రస్తుతం మార్కెట్ సీజన్ కావడంతో ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పెంబర్తికి చెందిన బాల్దె సిద్దిలింగం (Balde Siddilingam) ను, వైస్‌ చైర్మన్‌గా ముసిపట్ల విజయ్‌కుమార్ (Musipatla Vijaykumar), మరో 17 మందితో కూడిన కమిటీని నియమించారు.

ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా మాల రాజు, శివరాత్రి రాజ్‌కుమార్, నూనెముంతల యాకస్వామి, బసవగాని బాల మల్లేశ్, సేవెళ్లి మధుసూదన్, గువ్వల రవి, బుశిగంపల ఆంజనేయులు, ధర్మ జయప్రకాశ్‌రెడ్డి, అజ్మీరా మంగమ్మ, సుధగాని సంజీవ, మాశెట్టి వెంకటేశ్వర్లు, మాశెట్టి అశోక్‌ కమిటీ మెంబర్లుగా నియమించారు. వీరితో పాటు జనగామ పీఎసీఎస్‌ చైర్మన్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, జిల్లా అగ్రికల్చర్‌‌ ఆఫీసర్, మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ కూడా మెంబర్లుగా ఉన్నారు.

బాధ్యతతో పనిచేస్తాం

తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా నూతన చైర్మన్ సిద్దిలింగం మాట్లాడుతూ చెప్పారు. తన నియామకానికి సహకరించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy), స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు (Errabelli Dayakar Rao), జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.