NTR30: జాన్వీ కపూర్ లుక్ అదిరింది.. ఇక ఊపిరాడనివ్వరట
విధాత, సినిమా: సాధారణంగా దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva0 అంటే కమర్షియల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన నుంచి సామాజిక సందేశం ఉండే చిత్రాలను అందరూ ఆశిస్తారు. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సామాజిక సమస్యను భుజానికి ఎత్తుకుంటారు. ‘మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలలో సామాజిక సమస్యలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ, ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కలిసి […]

విధాత, సినిమా: సాధారణంగా దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva0 అంటే కమర్షియల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన నుంచి సామాజిక సందేశం ఉండే చిత్రాలను అందరూ ఆశిస్తారు. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సామాజిక సమస్యను భుజానికి ఎత్తుకుంటారు.
‘మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలలో సామాజిక సమస్యలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ, ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కలిసి నటించిన ‘ఆచార్య (Acharya)’ చిత్రం డిజాస్టర్ అయింది.
దీంతో ప్రతి ఒక్కరు కొరటాల శివను ఓ విలన్‌గా చూస్తున్నారు. ఏ దర్శకుడూ తన చిత్రాన్ని అందునా మెగాస్టార్, మెగాపవర్ స్టార్లు కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు దానిని చెడగొట్టుకోరు. ఏ దర్శకునికి అన్ని చిత్రాలు హిట్ కావు. వాటిల్లో కొన్ని అనూహ్య పరాజయాలు సైతం ఉంటాయి. అన్నింటిని అందరు జడ్జ్ చేయలేరు. అలాగైతే అసలు ఫ్లాప్ అనేదే ఉండదు కదా!
తాజాగా ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇప్పుడు కొరటాలతో తారక్ చేస్తున్న చిత్రం.. తారక్‌కి 30వ చిత్రం. దాంతో ఈ చిత్రాన్ని ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో యువ సుధా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ (NTR Arts Banner) నిర్మిస్తున్నాయి.
She’s the calm in the storm from the fierce world of #NTR30 ❤️
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!Happy Birthday and welcome onboard #JanhviKapoor