జాన్వీ అంత మాట అనేసిందేంటి?.. రష్మిక, విజయ్ బంధం గురించి తెలిసేనా!
విధాత: ఒక వైపు సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గడం లేదు. ఇంకా డబుల్ అవుతోంది. ముఖ్యంగా యూత్.. విజయ్ దేవరకొండ అంటే పడి చస్తారు. జంట్స్‌లోనే కాదు.. లేడీస్‌లోనూ విజయ్‌కి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే.. లేడీసే విజయ్‌ని బాగా లైక్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే విజయ్ క్రేజ్ మాములుగా లేదు. ఏ హీరోయిన్‌ని కదిలించినా.. ఈ రౌడీ […]

విధాత: ఒక వైపు సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గడం లేదు. ఇంకా డబుల్ అవుతోంది. ముఖ్యంగా యూత్.. విజయ్ దేవరకొండ అంటే పడి చస్తారు. జంట్స్‌లోనే కాదు.. లేడీస్‌లోనూ విజయ్‌కి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే.. లేడీసే విజయ్‌ని బాగా లైక్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే విజయ్ క్రేజ్ మాములుగా లేదు.
ఏ హీరోయిన్‌ని కదిలించినా.. ఈ రౌడీ పేరే చెబుతారు. ఎవరితో డేటింగ్, ఎవరితో క్రష్ అంటే కూడా విజయ్ పేరునే వారు వాడుతున్నారు. అలాంటి విజయ్‌పై తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ విన్నవారంతా.. విజయ్‌ని జాన్వీ అంత మాట అనేసిందేంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ జాన్వీ కపూర్ ఏమని అంది? అని అనుకుంటున్నారు కదా! అతనికి ప్రాక్టికల్‌గా పెళ్లి అయిపోయిందనేలా విజయ్‌పై జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది. విషయంలోకి వస్తే.. తాజాగా జాన్వీ కపూర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. స్వయంవరం నిర్వహించాల్సి వస్తే.. ఇప్పుడున్న ఏ ముగ్గురు హీరోలను చూజ్ చేసుకుంటారనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. రణబీర్, ట్రైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ పేర్లను జాన్వీ చెప్పింది. వీరిలో రణబీర్‌కి పెళ్లయిపోయిందని చెబుతూ.. అతని పేరుని తీసేసింది.
ఆ పేరు స్థానంలో మరొక హీరో పేరు ఆలోచిస్తున్న జాన్వీకి విజయ్ పేరుని యాంకర్ సజెస్ట్ చేయగా.. అందుకు జాన్వీ సమాధానమిస్తూ.. ‘విజయ్‌కి కూడా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్లే.. కాబట్టి అతడిని ఈ స్వయంవరానికి కన్సిడర్ చేయలేను..’’ అని జాన్వీ అంది. అంతే, ఆమె చెప్పిన ఈ మాటతో విజయ్‌కి ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయిందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
జాన్వీ చెప్పిన ప్రకారం.. విజయ్, రష్మిక మందన్నల బంధం ఆ స్థాయికి వెళ్లిపోయిందని అంతా అనుకుంటున్నారు. అన్నట్లు.. వారిద్దరూ కలిసి ఈ మధ్య మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే కదా. అందుకే జాన్వీ అలా అని ఉంటుందని అంతా భావిస్తున్నారు.