Jio Hotstar OTT: జియో, హాట్‌స్టార్ విలీనం.. చవకగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్! ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు తిప్పలు

విధాత: గత కొంతకాలంగా ఇంటిపట్టున ప్రేక్షకులను అలరించిన ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫాంలు డిస్నీ హాట్‌స్టార్, జియో సినిమాలు ఎట్టకేలకు విలీనమై జియో హాట్‌స్టార్ (Jio Hotstar)గా బాహుళ్యంలోకి వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం ఫిబ్రవరి 14 నుంచి అండ్రాయిడ్, యాపిల్ ఇతర అన్నిరకాల సర్వీసు ప్రోవైడర్‌లలో సదరు యాప్‌ల స్థానంలో జియో హాట్‌స్టార్ అప్‌డేట్ సైతం అయింది. ఇప్పటికే సదరు ఓటీటీల్లో సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు వాటి గడువు వరకు అవి పని చేయనున్నాయి. ఇదిలాఉండగా తాజాగా జరిగిన ఈ విలీనంతో 50 కోట్లకు పైగా యూజర్స్, మూడు లక్షల గంటలకు పైగా ఉన్న కంటెంట్‌తో డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో జియో హాట్‌స్టార్ భారత డిజిటల్ స్ట్రీమింగ్ మార్కెట్‌లో అతిపెద్దదిగా అవతరించి చరిత్ర సృష్టించింది.
ఇకపై జియో సినిమాలో ఎక్స్‌క్లూజివ్‌గా వస్తున్న విదేశీ కంటెంట్‌తో పాటు హాలీవుడ్ సినిమాలు, ఐపీఎల్ , ఐసీఎల్, ప్రో కబడ్డీ ఇలా అన్నిరకాల స్పోర్ట్స్ ఇకపై ఒకటే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటి సబ్ స్క్రిప్షన్ ధరలను మూడు భాగాలుగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) తాజాగా ప్రకటించింది. ఈ ధరలను చూస్తే భవిష్యత్‌లో నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లకు గట్టి దెబ్బే తగలనుందని అర్థమవుతోంది. కొత్తగా ప్రకటించిన జియో హాట్ స్టార్ (Jio Hotstar) ధరలను చూస్తే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ కన్నా చవక ప్లాన్‌లుగా ఉండనున్నాయి. వీటి నెల ఫ్లాన్‌కు.. జియోలో మూడు నెలల ఫ్లాన్ వస్తోంది.
జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఫ్లాన్స్..
మొబైల్స్: రూ.149 ఫ్లాన్ మూడు నెలలు, సంవత్సరం ఫ్లాన్ రూ.499 ఉండనుంది. ఒకసారి ఒక యూజర్ మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. మధ్యలో ప్రకటనలు కూడా ఉంటాయి. మధ్యలో యాడ్స్ వద్దనుకుంటే మూడు నెలలకు రూ.499 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇక టీవీ ఓటీటీ ఫ్లాన్ల అంశానికొస్తే..
సూపర్ ఫ్లాన్ రూ.299తో మూడు నెలలు, రూ. 899తో ఏడాది వ్యవధి ఉండనుంది. మోబైల్, టీవీ, వెబ్ వీటిలో ఎందులోనైనా ఒకేసారి ఇద్దరు చూడవచ్చు కానీ మధ్యలో ప్రకటనలు తప్పనిసరి.
ప్రీమియం ఫ్లాన్‌లో.. నెలకు రూ. 299, 3నెలలకు రూ. 499, సంవత్సరానికి రూ. 1499లతో ఒకేసారి 4 డివైజ్‌లలో వాడొచ్చు. ఎలాంటి ప్రకటనలు ఉండవు.
ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాన్స్ ధరలివే..
ప్రస్తుతం.. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాన్ నెలకు: రూ .299, 3 నెలలకు: రూ.599, సంవత్సరానికి: రూ.1499 చెల్లించాల్సి ఉంది.
ఇక నెట్‌ఫ్లిక్స్ (Netflix) మొబైల్ (480పీ) వెర్షన్ నెలకు రూ.149 (1 మెంబర్) ఉండగా, బేసిక్ ఫ్లాన్ (720 పీ) నెలకు రూ. 199 (1 మెంబర్), స్టాండర్డ్ (1080పీ) ఫ్లాన్ నెలకు రూ.499 (2 మెంబర్స్), ప్రీమియం (4కె + హెచ్ డిఆర్) ఫ్లాన్ నెలకు రూ. 649. (4 మెంబర్స్) చెల్లించాల్సి వస్తుంది.