Mukesh Ambani | రిలయన్స్‌ చేతికి డిస్నీ హాట్‌స్టార్‌, ఛానెల్స్‌! అదే జరిగితే జియోకు తిరుగుండ‌దు?

Mukesh Ambani భారత టెలి కమ్యూనికేషన్ రంగంలో రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉచిత ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కి బాగా ద‌గ్గ‌రైన జియో నెట్‌వ‌ర్క్ చాలా నెట్‌వ‌ర్క్స్‌ని దెబ్బ‌తీసింది. అన్ని రంగాల‌లోకి రిల‌య‌న్స్ నెమ్మ‌దిగా విస్త‌రిస్తుండ‌గా, ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ముందుగా స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ చేజిక్కించుకొని జియో సినిమా యాప్‌తో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేటి క్రీడా ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాలను ఒక్క పైసా లేకుండా ఉచితంగా అందిస్తుంది. […]

  • By: sn    latest    Sep 20, 2023 11:10 AM IST
Mukesh Ambani | రిలయన్స్‌ చేతికి డిస్నీ హాట్‌స్టార్‌, ఛానెల్స్‌! అదే జరిగితే జియోకు తిరుగుండ‌దు?

Mukesh Ambani

భారత టెలి కమ్యూనికేషన్ రంగంలో రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉచిత ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కి బాగా ద‌గ్గ‌రైన జియో నెట్‌వ‌ర్క్ చాలా నెట్‌వ‌ర్క్స్‌ని దెబ్బ‌తీసింది. అన్ని రంగాల‌లోకి రిల‌య‌న్స్ నెమ్మ‌దిగా విస్త‌రిస్తుండ‌గా, ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

ముందుగా స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ చేజిక్కించుకొని జియో సినిమా యాప్‌తో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేటి క్రీడా ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాలను ఒక్క పైసా లేకుండా ఉచితంగా అందిస్తుంది. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాన్ గా రాణిస్తున్న అంబానీ అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వాల్ట్‌ డిస్నీని కూడా చేజించిక్కుబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇది జ‌రిగితే అద్భుతమే అని చెప్పాలి.

కొన్నాళ్ల క్రితం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్‌ ఇప్పుడు ఆ రంగంలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న డిస్నీని కొనుగోలు చేస్తే మాత్రం మార్కెట్‌ మొత్తం రిలయన్స్ చేతిలో ఉండ‌డం ఖాయం. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ హక్కులను సైతం ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పాటు ఐపీఎల్ సంబంధిత స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. రిల‌య‌న్స్‌కి చెందిన వ‌యాకామ్ 18 హ‌క్కుల‌ని ద‌క్కించుకోగా, జియో టీవీ ద్వారా ఫ్రీగా స్ట్రీమ్ చేసింది.

దాంతో డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రైబర్లు క్ర‌మంగా తగ్గుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే డిస్నీ ఇండియా వ్యాపార విక్రయానికి చర్చలు ప్రారంభించినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలియ‌జేసింది. రిలయన్స్ సంస్థ పోటీని ఏమాత్రం తట్టుకోలేకపోతున్న స్టార్ నెట్ వర్క్.. డిస్నీ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్‌కు విక్ర‌యించేందుకు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు డీల్ వ‌ర‌కు వెళ్ల‌లేద‌ని తెలుస్తుండ‌గా, ఈ అంశంపై స్పందించేందుకు డిస్నీ ప్రతినిధి నిరాకరించారు. ఇక రిలయన్స్ అధికార ప్రతినిధి మాత్రం వచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు కంపెనీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పూర్తి వివ‌రాలు తెలియ‌ జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.