JFS | జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. షేర్ల లిస్టింగ్ తేదీ బయటకు!
JFS | ముంబై: తన ఆర్థిక సర్వీసుల విభాగం ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు అతి త్వరలో లిస్టు చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మంగళవారం ప్రకటించింది. గత నెలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం JFS షేర్ ధరను రూ.261.85గా నిర్ణయించింది. ఇటీవలే రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ నుంచి తన ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడదీస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు జేఎఫ్‌ఎస్ అని నామకరణం చేశారు. ఆర్‌ఐఎల్ షేర్ కలిగిన […]

JFS |
ముంబై: తన ఆర్థిక సర్వీసుల విభాగం ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు అతి త్వరలో లిస్టు చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మంగళవారం ప్రకటించింది. గత నెలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం JFS షేర్ ధరను రూ.261.85గా నిర్ణయించింది.
ఇటీవలే రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ నుంచి తన ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడదీస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు జేఎఫ్‌ఎస్ అని నామకరణం చేశారు.
ఆర్‌ఐఎల్ షేర్ కలిగిన ప్రతి ఒక్కరూ డీమెర్జ్‌డ్‌కు సంబంధించిన ఒక షేరు పొందుతారు. రిలయన్స్ అధినే ముకేశ్ అంబానీ ఆగస్ట్ 28న నిర్వహించే కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్‌ల మీటింగ్‌లో లిస్టింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
సులభమైన, సరసమైన, వినూత్నమైన డిజిటల్ ఫస్ట్ సొల్యూషన్స్‌ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా అందించాలని భావిస్తున్నట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. కొత్త సంస్థ ప్రస్తుతానికి తక్కువ రెవెన్యూతోనే రిలయన్స్‌లో 6.1 శాతం వాటా కలిగి ఉన్నది. గత నెలలో మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ప్రారంభానికి బ్లాక్‌రాక్‌తో 50:50 భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
JFS, BlackRock కంపెనీలు చెరొక 150 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెడతాయి. అసెట్ మేనేజ్‌మెంట్ రంగంలో దాదాపు 41 కంపెనీలు ఉండగా.. అవి 40 లక్షల కోట్లపైనే వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలే బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. రాబోయే నెలల్లో జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి కూడా జేఎఫ్‌ఎస్ విస్తరించే అవకాశం ఉన్నదని ఊహాగానాలు వెలువడుతున్నాయి.