కేసీఆర్ వెనుక ఉండి భారీగా అక్రమాస్తులు
వందల కోట్ల డైమండ్లు
ఆ ముగ్గురి ఆస్తులకంటే ఆయన ఆస్తులే ఎక్కువ
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యరావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 10ఏళ్ల కేసీఆర్ దొర పాలనలో వేల కోట్ల రూపాయలు దోచేసిన సంతోష్ రావు అమెరికాలో జెఎస్ రాంచ్ పేరిట 1000ఎకరాల భూములకు యజమానిగా మారాడని ఆరోపించారు. గూగుల్ లో సెర్చ్ చేస్తే దాని వివరాలు కూడా తెలుసుకోవచ్చన్నారు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్య్వూలో రమ్యారావు సంతోష్ రావు అక్రమాస్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వెనుక ఉండి భారీగా అక్రమాస్తులు, భూములు సంపాదించాడని ఆరోపించారు. సంతోష్ రావు వద్ధ వందల కోట్ల డైమాండ్స్ ఉన్నాయని..ఒక్కోటి రూ.50కోట్ల విలువైన డైమాండ్స్ ఉన్నాయని చెప్పారు. గతంలో చెప్పులు లేని సంతోష్ రావుకు మూడు ఫామ్ హౌజ్ లు ఉన్నాయన్నారు. ఇంకా ఇక్కడ ఫామ్ హౌజ్ లు, బిల్డింగ్ లు ఎందుకని చెప్పి..అమెరికాలో 1000ఎకరాలు సమకూర్చుకున్నాడన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ల ఆస్తులకంటే సంతోష్ రావు ఒక్కడి ఆస్తులే అంతకంటే ఎక్కువగా ఉన్నాయని రమ్యారావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో సంతోష్ రావు కీలమని..ట్యాపింగ్ ద్వారా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నాడన్నారు. కేసీఆర్ కు వచ్చే ఫోన్లు ముందుగా సంతోష్ రావునే ఎత్తి తనకు నచ్చినవారికే కేసీఆర్ అపాయింట్ మెంట్ కల్పించేవారన్నారు. సంతోష్ రావును టానిక్ కేసు, హరిత హారం అక్రమాలపై విచారణ చేయాలన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలలో చాల దేవిలు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాజకీయంగా దెబ్బతినడానికి..అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడానికి..అన్ని అనర్థాలకు సంతోష్ రావునే కారణమన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీన చర్చలు ఇప్పటికి కొనసాగుతున్నాయని..కవిత సైతం కాంగ్రెస్ హైకమాండ్ ను సంప్రదించిందన్నారు.
గతంలోనూ రమ్యారావు సంతోష్ రావుపై పలు ఆరోపణలు చేశారు. బీఆర్ ఎస్ అవిర్భావ సమయంలో చెప్పులు కూడా లేని సంతోష్ రావుకు 2007లో రూ. 7 కోట్ల ఆస్తులకు చేరాడని..2013లో ఆయన గ్రానైట్ క్వారీ భాగస్వామ్యాన్ని తీసుకున్నారని వెల్లడించారు. 2015లో మిడ్ మానేరు ముంపు బాధితుడిగా 2 గుంటల పట్టా తీసుకున్నారని… ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో ఆయనకు 200 ఎకరాల భూమి ఉందని… ఇదంతా ఎలా వచ్చిందని గతంలో ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా సంతోష్ రావు అండదండలతోనే సాగుతోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంతోష్ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డాడని..2007లో ఎలగందులలో తాను 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని… ఆ భూమిని సంతోష్ ఆక్రమించాడని ఆరోపించారు. సంతోష్ రావు శకుని..ఆర్థిక నేరగాడు అని తరుచు సంతోష్ రావు లక్ష్యంగా పలు ఆరోపణలు చేస్తున్న రమ్యారావు మరోసారి సంచలన ఆరోపణలు చేయడంతో అవి వైరల్ గా మారాయి.