JPS strike | ఈరోజు మధ్యాహ్నం కల్లా విధుల్లో చేరాలి: JPSలకు CS ఆదేశం

JPS strike విధాత: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై శుక్రవారం కలెక్టర్లు, డిపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ సమ్మె చేస్తున్న జేపిఎస్ లను ప్రభుత్వం చర్చలకు పిలిచేది లేదన్నారు. శ‌నివారం మధ్యాహ్నం 12 గంటల లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. విధులకు హాజరు కాని వారిని గుర్తించి ఆయా గ్రామాల వారీగా లిస్టు […]

JPS strike | ఈరోజు మధ్యాహ్నం కల్లా విధుల్లో చేరాలి: JPSలకు CS ఆదేశం

JPS strike

విధాత: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై శుక్రవారం కలెక్టర్లు, డిపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ సమ్మె చేస్తున్న జేపిఎస్ లను ప్రభుత్వం చర్చలకు పిలిచేది లేదన్నారు. శ‌నివారం మధ్యాహ్నం 12 గంటల లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు.

విధులకు హాజరు కాని వారిని గుర్తించి ఆయా గ్రామాల వారీగా లిస్టు డిపిఓ లకు పంపాలని ఎంపీడీవోలను ఆదేశించారు. విధులకు హాజరు కానీ జూనియర్ కార్యదర్శుల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.