Collectors conference | ఈ నెల 16న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ
పరిపాలనలో వేగం పెంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ మొదలు పెట్టారు. రాష్ట్రంలో తక్షణంగా చేపట్టాల్సిన సమస్యలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు

ప్రజాపాలన, ధరణి, వ్యవసాయంతో పాటు 9 అంశాలపై చర్చ
విధాత: పరిపాలనలో వేగం పెంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ మొదలు పెట్టారు. రాష్ట్రంలో తక్షణంగా చేపట్టాల్సిన సమస్యలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల16వ తేదీన ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేశారు.
ఈ కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు అందరు హాజరు కావాలని సర్క్యులర్ లో ఆదేశించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో 1) ప్రజాపాలన,2) ధరణి, 3)వ్యవసాయం- వాతావరణ పరిస్థితులు,4) వైద్యం-సీజనల్ వ్యాధులు, 5)వనమహోత్సవం,6) మహిళాశక్తి, 7) విద్య, 8) శాంతి భద్రతలు,9) డ్రగ్స్ నిర్మూలన అంశాలపై చర్చించనున్నట్లు సర్క్యులర్ లో కలెక్టర్లకు ఎజెండా పంపించారు. ఈ అంశాలపై ప్రిపేర్ అయి రావాలని కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు