Abhay Ram | అక్కాతమ్ముళ్లుగా.. మహేశ్ కూతురు సితార, NTR వారసుడు అభయ్ రామ్! ఎంట్రీ నిజం కాదా?
Abhay Ram | సినీ నటుల పిల్లలు వారసత్వంగా నటనలోకి రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ పిల్లలు బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు సినిమాల్లోకి వాళ్ళ తండ్రుల వారసత్వాన్ని పట్టుకుని వచ్చారు. వారి తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ వారసత్వంగా ఎంట్రీ ఇవ్వగా.. బాలయ్య తనయుడు త్వరలోనే అరంగేట్రం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వీరి తర్వాత అంటే ఇప్పుడు మహేష్ బాబు, […]

Abhay Ram |
సినీ నటుల పిల్లలు వారసత్వంగా నటనలోకి రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ పిల్లలు బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు సినిమాల్లోకి వాళ్ళ తండ్రుల వారసత్వాన్ని పట్టుకుని వచ్చారు. వారి తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ వారసత్వంగా ఎంట్రీ ఇవ్వగా.. బాలయ్య తనయుడు త్వరలోనే అరంగేట్రం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక వీరి తర్వాత అంటే ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ కుమార్తెలైన సితార, అర్హలు కూడా అరంగేట్రం చేసేశారు. సితార తన తండ్రి ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయగా.. ‘శాకుంతలం’లో భరతుడి పాత్రలో అల్లు అర్హ అరంగేట్రం చేసేసింది.
ఇంకా ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ కొడుకు.. ‘విన్నర్, భలే భలే మగాడివోయ్’ మూవీల్లో సుధీర్ బాబు కొడుకు కనిపించారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
త్వరలో రాజమౌళి.. మహేష్ బాబుతో తెరకెక్కించబోయే కొత్త సినిమాతో అభయ్ రామ్ ఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నారు. మహేశ్‌బాబుతో జక్కన్న ఓ భారీ మూవీ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా కొనసాగుతుంది.
ఈ చిత్రంలో ఇంట్రడక్షన్ సీన్‌లో సితార, అభయ్ రామ్ అక్కాతమ్ముళ్లుగా కనిపించబోతున్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది. వార్తలైతే విన బడుతున్నాయి కానీ.. ఎక్కడా అధికారికంగా బయటకు రాలేదు. అయితే ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యామిలీ వరకు చేరిందట.
ఎన్టీఆర్ ఫ్యామిలీకి సన్నిహితులైన కొందరు చెబుతున్న దానిని బట్టి.. అభయ్ రామ్ ఎంట్రీ ఇప్పుడప్పుడే కాదనేలా టాక్ వినబడుతోంది. అసలు అలాంటి ప్రపోజల్ జక్కన్న నుంచి రాలేదని, కావాలనే ఎన్టీఆర్, రాజమౌళిల బంధాన్ని దృష్టిలో పెట్టుకుని.. అభయ్ అరంగేట్రం గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారనేలా సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు. సో.. దీనిని బట్టి అభయ్ రామ్ రాబోయే మహేష్ బాబు, జక్కన్నల కాంబినేషన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం లేదని తెలుస్తుండగా.. ఇక సితార సంగతి మాత్రం తెలియాల్సి ఉంది.