Kantara Chapter 2| కాంతార చాప్టర్ 2నుంచి ఆడియో సాంగ్
కాంతారా చాప్టర్ 2 మూవీ దసరా కానుకగా ఆక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలియదు శివుడా..భక్తి మార్గం అంటూ సాగే ఆడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

విధాత : కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ 2( Kantara Chapter 2) మూవీ నుంచి మేకర్స్ ఆదివారం ఆడియో సాంగ్ రిలీజ్(audio song) చేశారు. కాంతారా చాప్టర్ 2 మూవీ దసరా కానుకగా ఆక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలియదు శివుడా..భక్తి మార్గం..బ్రహ్మ కలశా అంటూ సాగే ఆడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రచయిత కృష్ణకాంత్ రాసిన ఈ పాటకు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. అబ్బివీ ఆలపించారు. ఈ పాట కాంతారా మూవీలోని వరహరూపం పాట బాణిలో సాగుతూ సినిమాపై హైప్ పెంచింది. రిషిబ్ శెట్టిRishab Shetty ప్రధాన పాత్రలో స్వీయా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కాంతారా చాప్టర్ 2లో రుక్మిణి వసంత్ సహా పలువురు ప్రముఖ నటినటులు నటించారు.
కాంతార చాప్టర్ 1 ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు ఆదివారం హైదరాబాద్ సిటీలో జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. వర్షాల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ కొనసాగనుంది. ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాబోతున్నారు.