Jupally | కేసీఆర్ కుటుంబం.. అమ‌ర వీరుల ర‌క్త‌పు కూడు తింటున్నది: జూపల్లి కృష్ణారావు

Jupally | ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కే ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరుచుకోవు గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌జాస్వామ్యం ఉంది నెహ్రూ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి విధాత‌: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్న‌ద‌ని మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచిపోటీ చే య‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ లో అవినీతి, అరాచకం, భూకబ్జాలు పెట్రేగిపోతున్నాయని అన్నారు. […]

  • By: Somu    latest    Aug 22, 2023 12:38 PM IST
Jupally | కేసీఆర్ కుటుంబం.. అమ‌ర వీరుల ర‌క్త‌పు కూడు తింటున్నది: జూపల్లి కృష్ణారావు

Jupally |

  • ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కే ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరుచుకోవు
  • గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌జాస్వామ్యం ఉంది
  • నెహ్రూ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా
  • జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి

విధాత‌: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్న‌ద‌ని మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచిపోటీ చే య‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ లో అవినీతి, అరాచకం, భూకబ్జాలు పెట్రేగిపోతున్నాయని అన్నారు. ధరణి, భూ మాఫియా పై సిబిఐ విచారణ చేపించగలరా? అని అడిగారు.

అక్టోబర్ 16 మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామంటున్నారని, మేనిఫెస్టో అంటే భగవద్గీత బైబిల్, ఖురాన్ అని చెపుతున్న కేసీఆర్‌, మరి గత మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదని ప్ర‌శ్నించారు. ముందుగా కేసీఆర్‌
రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గజ్వెల్, కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్లే న‌ని అన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ప్పుడు గేట్లు తెరుచుకోని ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో ఆత్మగౌరవం ఉండదా? అని జూప‌ల్లి అడిగారు. కానీ గాంధీభవన్ లో, ఢిల్లీ ఏఐసిసిలో కూడా టికెట్ల కోసం కొట్టుకుంటాం? మాకు ఆ ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి భూమికి ఆకాశానికి ఉన్నంత ఉందని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆగ మేఘాల మీద 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దాని వల్ల ప్రజలకు ఎం ఒరిగిందని ప్ర‌శ్నించారు. ఇప్పటి నేతలంతా గతంలో పోటీ చేశార‌ని, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. గతంలో పోటీ చేసిన వారు ఎవరెవరు ఎలాంటి వారో యావత్ రాష్ట్రం చూసిందని తెలిపారు. ఉప ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎవరు పెట్టలేదు. మీరు ఇందులో ఆదర్శమా? అని అడిగారు.

మైనంప‌ల్లి దెబ్బ.. కేసీఆర్‌కు రుచి చూపించాలి

హరీష్ రావు డబ్బా పెట్టె స్లిప్పర్ చెప్పులతో వ‌చ్చాడ‌ని ఎమ్మెల్యే మైనంపల్లి హ‌న్మంత‌రావు అన్నారని అలా వ‌చ్చిన హ‌రీశ్‌రావుకు ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి? అని అడిగారు. అదంతా అబ‌ద్దం అన్న‌ట్లేగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని, మైనంపల్లి హన్మంతరావు తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా మాట్లాడారని చెప్పారు.

ఆత్మగౌరవం, రోషం, పౌరుషంతో మైనంపల్లి దెబ్బ కేసీఆర్ కి రుచి చూపించాలన్నారు. పట్నం పౌరుషం చూపించాలని, పట్నం మహేందర్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నాన‌న్నారు. దీంతో కెసిఆర్ దిమ్మ తిరగాలన్నారు. మీరు ట్రైలర్ చూసారు, మీ 9 ఏళ్ళ సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చిందన్నారు. కారును గుద్దుడు గుద్దతే అప్పడం కావాలన్నారు.

వ‌డ్డీ మాత్ర‌మే మాఫీ

9 సంవత్సరాల్లో లక్ష రుణమాఫీ కి వడ్డీ లక్ష అయింద‌ని, మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేశారని జూప‌ల్లి అన్నారు. నేను కొల్లాపూర్ నుండి పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాన‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవసరమేన‌ని తెలిపారు. అయితే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తి పోత‌ల ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ పూర్తి చేసిందని చెప్పారు.