ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబుమోహన్‌

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ను ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ నియమించారు.

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబుమోహన్‌

విధాత : ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ను ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ నియమించారు. బాబూ మోహన్ ఇటీవలే బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్రజా శాంతి పార్టీలో చేరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన ప్రజాశాంతి పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో అంధోల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాబుమోహన్ ఓటమి చెందారు. అక్కడ కాంగ్రెస్‌ నుంచి దామోదర రాజనరసింహ గెలుపొందగా, బీఆరెస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌ రెండో స్థానంలో నిలువగా బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. బాబుమోహన్ ప్రజాశాంతి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించారు.