తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ: కేఏ పాల్

- 2న హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం
- ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమ ప్రయత్నం సాగుతుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చెప్పారు. వరంగల్ లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
వచ్చే నెల 2న 119 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించాలనుకునే వారితో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజాశాంతి పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సంఘ పెద్దలు హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఈ సమావేశానికి హాజరుకావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.