Ganguly | చీక‌టి రోజుల్లో గంగూలీ వెలుగు నింపాడు.. మ‌హ్మ‌ద్ కైఫ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Ganguly: మ్యాచ్ ఫిక్సింగ్ కుంభ‌కోణంతో భార‌త క్రికెట్‌లో చీక‌టి రోజులు ఏర్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో కెప్టెన్‌గా అద్భుతాలు సృష్టించారు గంగూలి. ఆయ‌న 2000వ సంవత్సరం నుంచి 2004 వరకూ టీమిండియా కెప్టెన్‌గా ఉండ‌గా, గంగూలీ కెప్టెన్సీలో 2002లో ఛాంపియన్స్ ట్రీఫీ విజేతగా నిలిచిన టీమిండియా, అనేక అద్భుతాలు కూడా సాధించింది. 2000 సంవ‌త్స‌రంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరిన భారత జట్టు, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచి సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఇంగ్లాండ్‌లో ట్రై […]

  • By: sn    latest    Jul 10, 2023 6:14 AM IST
Ganguly | చీక‌టి రోజుల్లో గంగూలీ వెలుగు నింపాడు.. మ‌హ్మ‌ద్ కైఫ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Ganguly: మ్యాచ్ ఫిక్సింగ్ కుంభ‌కోణంతో భార‌త క్రికెట్‌లో చీక‌టి రోజులు ఏర్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో కెప్టెన్‌గా అద్భుతాలు సృష్టించారు గంగూలి. ఆయ‌న 2000వ సంవత్సరం నుంచి 2004 వరకూ టీమిండియా కెప్టెన్‌గా ఉండ‌గా, గంగూలీ కెప్టెన్సీలో 2002లో ఛాంపియన్స్ ట్రీఫీ విజేతగా నిలిచిన టీమిండియా, అనేక అద్భుతాలు కూడా సాధించింది. 2000 సంవ‌త్స‌రంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరిన భారత జట్టు, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచి సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఇంగ్లాండ్‌లో ట్రై సిరీస్ కూడా గెలిచింది..

ఇక అండర్‌ డాగ్స్‌గా 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన టీమిండియా వ‌రుస విజ‌యాలు సాధిస్తూ ఫైన‌ల్‌కి చేరుకుంది. కాని ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతులో ఓడింది. అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో అద్భుతాలు చేసింద‌ని చెప్పాలి. ఆ స‌మ‌యంలో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి కుర్రాళ్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి భార‌త్‌కి మ‌ర‌పురాని విజ‌యాలు అందించారు. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న మ‌హ్మ‌ద్ కైఫ్ తాజాగా సౌర‌వ్ గంగూలీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌ చీకటి రోజుల్లో టీమ్‌ని కుర్రాళ్లతో నింపిన సౌర‌వ్ గంగూలీ అద్భుతాలు సృష్టించాడ‌ని చెప్పాలి.

ఏ ఆట‌గాడైన క్రీజులోకి వెళ్లిన తర్వాత బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తే వారికి జ‌ట్టులో ప్లేస్ ఉండేలా చూసుకునే బాధ్యత నాది.. అంటూ నాలో భరోసా నింపాడు గంగూలీ. అత‌ను చెప్పినట్టే నాకు ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో క‌నుక గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోకపోయి ఉంటే, టీమిండియా పరిస్థితి ఇలా ఉండేది కాదు.. అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్‌. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కూడా వ్య‌హ‌రించిన విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల‌త క్రితం ఆయ‌న గుండెపోటుకి కూడా గురైన విష‌యం తెలిసిందే.