Kohli:కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్ ఎత్తి ప‌డేశాడు.. త‌ర్వాత అన్న‌ట్టే చేశాడ‌న్న కైఫ్‌

Kohli: టీమిండియా మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఆయ‌న బ్యాట్ ప‌డితే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. ఎలాంటి బంతినైన త‌న బ్యాటింగ్ టెక్నిక్‌తో బౌండ‌రీకి త‌ర‌లించ‌డం విరాట్ స్పెషాలిటీ. స‌చిన్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కోహ్లీ. అండర్19 వరల్డ్ కప్ లోఅద్భుతంగా ఆడి 2008లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, జ‌ట్టులో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. రోజురోజుకి అద్భుత‌మైన […]

  • By: sn    latest    Jul 27, 2023 6:56 AM IST
Kohli:కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్ ఎత్తి ప‌డేశాడు.. త‌ర్వాత అన్న‌ట్టే చేశాడ‌న్న కైఫ్‌

Kohli: టీమిండియా మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఆయ‌న బ్యాట్ ప‌డితే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. ఎలాంటి బంతినైన త‌న బ్యాటింగ్ టెక్నిక్‌తో బౌండ‌రీకి త‌ర‌లించ‌డం విరాట్ స్పెషాలిటీ. స‌చిన్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కోహ్లీ. అండర్19 వరల్డ్ కప్ లోఅద్భుతంగా ఆడి 2008లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, జ‌ట్టులో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. రోజురోజుకి అద్భుత‌మైన ఆట తీరు క‌నబ‌రుస్తూ టీమిండియా కెప్టెన్ కూడా అయ్యాడు.

అయితే తాజాగా విరాట్ కోహ్లీ గురించి టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కోహ్లీ మిగ‌తా ప్లేయ‌ర్స్ క‌న్నా భిన్న‌మైన ఆట‌గాడ‌ని నాకు చాలా ఏళ్ల కిందే అర్ధ‌మైంది. ఐపీఎల్‌లో నేను ఆర్‌సీబీకి ఆడినప్పుడు విరాట్ కోహ్లీని చాలా దగ్గర నుండి చూశాను.ఒక మ్యాచ్‌లో అత‌ను సింగిల్ డిజిట్ స్కోర్‌కి ఔట్ అయి డ్రెస్సింగ్ రూమ్ లోకి వ‌చ్చాడు. రాగానే అత‌ను బ్యాట్ ప‌డేస్తాడ‌ని అనుకున్నాను. అలానే బ్యాట్ ఎత్తి ప‌క్క‌న ప‌డేసి ప్యాడ్స్ తీసాడు. ఇక నా ప‌క్క‌న కూర్చొని ఆవేశంగా త‌ర్వాతి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేస్తాన‌ని అన్నాడు. అప్పుడు నేను విని సైలెంట్‌గా ఉన్నా.

కాని త‌దుప‌రి మ్యాచ్‌లో అత‌ను చెప్పిన‌ట్టుగానే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు ఆ మ్యాచ్‌ని గెలిపించి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ కూడా గెలిచాడు. అప్పుడు అతని మైండ్ సెట్ ఎలా ఉందో తెలిసి నాకు ఆశ్చర్యం అనిపించింది. తక్కువ స్కోరుకి ఔట్ అయ్యాన‌ని ఫీలైన కోహ్లీ, తర్వాతి మ్యాచ్‌‌లో దాని ఎఫెక్ట్‌ని ఎంత పాజిటివ్‌గా తీసుకున్నాడు అనేది నాకు అర్ధ‌మైంది.. సాధార‌ణంగా కొందరు ఒక మ్యాచ్‌లో తక్కువ స్కోరుకి అవుటైతే, నెక్ట్స్ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అవుతామేమో అని భయాందోళ‌న చెందుతారు. కాని విరాట్ మాత్రం ప్ర‌తి మ్యాచ్‌కి మంచి స్కోర్ సాధించాల‌ని క‌సిగా ఆడ‌తాడు. విరాట్ లో ఉన్న‌ ఆ కసి, అత‌నిని స్పెషల్ ప్లేయర్‌గా మార్చింది, అత‌న్ని చూస్తుంటే నాకు గ‌ర్వంగా ఉంటుంద‌ని అని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు.