Kakatiya Artifacts | నిర్లక్ష్య నీడలో కాకతీయ కళాఖండాలు: పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శివ నాగిరెడ్డి

Kakatiya Artifacts | విధాత: నాగార్జునసాగర్ కృష్ణా నది తీరాన పునర్ నిర్మించబడిన ఏలేశ్వరం మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో రోడ్డు పక్కన క్రీస్తు శకము 13వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం శిలాఖండాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా సాగర్ కు వచ్చిన ఆయన పునర్ నిర్మించబడిన ఏలేశ్వరం స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించి […]

  • By: krs |    latest |    Published on : Jun 20, 2023 3:42 PM IST
Kakatiya Artifacts | నిర్లక్ష్య నీడలో కాకతీయ కళాఖండాలు: పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శివ నాగిరెడ్డి

Kakatiya Artifacts |

విధాత: నాగార్జునసాగర్ కృష్ణా నది తీరాన పునర్ నిర్మించబడిన ఏలేశ్వరం మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో రోడ్డు పక్కన క్రీస్తు శకము 13వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం శిలాఖండాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బుద్ధవనం సందర్శనలో భాగంగా సాగర్ కు వచ్చిన ఆయన పునర్ నిర్మించబడిన ఏలేశ్వరం స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించి అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న చక్కటి పనితనంతో చేసిన కళాఖండాలను నల్ల సానపు రాతితో చేసిన యోని ఆకారపు శివలింగ పానవట్టం, ద్వారా శాఖ, ఆలయ గోడ స్తంభం పైకప్పుల బండలు మొత్తం 20కి పైగా అక్కడ పడి ఉన్నాయని ఆయన తెలిపారు.

నాగార్జునసాగర్ జలాశయం లో నీటి ముంపునకు గురైన సమయంలో ఏలేశ్వరం స్వామి దేవాలయాన్ని ఏలేశ్వరం నుంచి అప్పటి పురావస్తు కేంద్ర శాఖ అధికారి ఆర్ .సుబ్రహ్మణ్యం తరలించి 1960 సంవత్సరంలో హిల్ కాలనీలో పునర్మించారని అన్నారు.

వాటిలో కొన్నిటిని ఆలయం బయట రోడ్డు పక్కన పడవేశారని అప్పటి నుంచిఇప్పటివరకు వాటిని పట్టించుకున్న వారు లేరన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటిని భద్రపరచాలని కనీసం దేవాలయ కమిటీ అయినా బయట పడి ఉన్న వాటిని దేవాలయ లోపలకు చేర్చాలని కోరారు.