Kalki 2898 AD | నాగ్ అశ్విన్‌కి.. ప్రభాస్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తున్నారు.. ఎక్కడంటే?
Kalki 2898 AD | విధాత: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ‘కల్కి 2898 AD’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.. ‘ఆదిపురుష్’ ఫ్లాప్ తర్వాత బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌కి కూడా ఇప్పుడు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అందులో ‘కల్కి 2898 AD’ అనే పాన్ వరల్డ్ సినిమాపై ఈ మధ్య వచ్చిన గ్లింప్స్ ఆసక్తిని పెంచేసింది. […]

Kalki 2898 AD |
విధాత: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ‘కల్కి 2898 AD’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.. ‘ఆదిపురుష్’ ఫ్లాప్ తర్వాత బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌కి కూడా ఇప్పుడు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అందులో ‘కల్కి 2898 AD’ అనే పాన్ వరల్డ్ సినిమాపై ఈ మధ్య వచ్చిన గ్లింప్స్ ఆసక్తిని పెంచేసింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనితోపాటు పోస్టర్, టైటిల్ విడుదల చేయడం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్ గురించి, పోస్టర్ గురించి చాలా చర్చలే జరిగినా, ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నా, ఎక్కడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటి వరకూ స్పందించ లేదని అంతా అనుకున్నారు.
తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో కల్కి గురించిన మరింత సమాచారం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సమాచారం తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఈ మూవీపై మరింతగా అంచనాలు మొదలయ్యాయి. ‘కల్కి 2898 AD’ గ్లోబల్ సినిమాగా విడుదల కానుంది. అలాగే గ్లింప్స్ విడుదలై ఈ మూవీపై అంచనాలను ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. మొత్తం మూవీ టేకింగ్, మేకింగ్ అంతా హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఫ్యాన్స్‌కి మతి పోయినట్లయింది.
ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకున్నా కూడా, కల్కి అనే పాత్ర మళ్లీ పురాణాలవైపే తీసుకు వస్తుంది. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ ఏ ప్రమాణాలతో దీనిని తెరకెక్కిస్తున్నాడోననే అంచనాలతో పాటు, తెగ క్రేజ్ లేపుతున్న విషయం మరోకటి ఏంటంటే.. కల్కి 2898 ఏడీ మూవీకి సీక్వెల్ ఉండబోతుందని, ఫ్రాంచైజీగా రానున్నదనే విషయం మీద దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు.
ఈ ప్రాజెక్ట్ కి ప్రభాస్‌ను ఎందుకు తీసుకోవలసి వచ్చిందో కూడా నాగ్ అశ్విన్ వివరించాడు. అయితే కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ గురించి ఇప్పటివరకూ ఆలోచించలేదని, ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్లు, లొకేషన్లు, వెహికల్స్ తో మాత్రం యానిమేటెడ్ షోస్ తీసే అవకాశం ఉందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
‘కల్కి 2898 AD’ కథ అనుకున్నప్పుడు దీనికి హీరోగా సరిగ్గా సరిపోయే విధంగా ఎవరుండాలి అనేది నాగ్ అశ్విన్ దృష్టిలో ఎప్పుడో ఉందట.. దీనికి ప్రభాస్ మాత్రమే సరిపోతాడని ఆయన బలంగా నమ్మానని చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ని దృష్టిలో ఉంచుకునే కథ తయారైందని చెప్పాడు. ప్రభాస్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేదని వెల్లడించాడు. దీంతో అభిమానుల మనసులలోనే నాగ్ అశ్విన్‌కు గుడి కట్టేస్తున్నారు.
కాగా ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, పశుపతి కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రానుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా, ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నట్లు ముందుగా ప్రకటించినా.. మే నెలలో వచ్చే అవకాశముందని తెలుస్తోంది.