కాంతార 2: సీక్వెల్ కాదు.. ఫ్రీక్వెల్

kantara2 దక్షిణాది దమ్ము చూపించిన చిత్రాలలో కాంతార ఒకటి. 16 కోట్ల పరిమిత బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. కాంతార ఘన విజయం సాధించగానే కాంతార 2 గురించి చర్చ మొదలైంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందా? ఉంటే ఎప్పుడు? అనేలా ఆసక్తిగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ క్లారిటీ ఇచ్చింది. కాంతార కథకు కొనసాగింపు ఉందని.. ఈ ఏడాది జూన్‌లో […]

  • By: krs    latest    Jan 22, 2023 1:09 PM IST
కాంతార 2: సీక్వెల్ కాదు.. ఫ్రీక్వెల్

kantara2

దక్షిణాది దమ్ము చూపించిన చిత్రాలలో కాంతార ఒకటి. 16 కోట్ల పరిమిత బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. కాంతార ఘన విజయం సాధించగానే కాంతార 2 గురించి చర్చ మొదలైంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందా? ఉంటే ఎప్పుడు? అనేలా ఆసక్తిగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ క్లారిటీ ఇచ్చింది.

కాంతార కథకు కొనసాగింపు ఉందని.. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువెళ్తామని ప్రకటించింది. అయితే ఇది సీక్వెల్ కాదు ఫ్రీక్వెల్ అని వెల్లడించింది. రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారట. త్వరలోనే అవి ఓ కొలిక్కి వస్తాయని సమాచారం.

2024 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. రిషబ్ శెట్టి తానే హీరోగా దర్శకత్వం వహించిన కాంతార చిత్రానికి ఫ్రీక్వెల్ అంటే దక్షిణాదితోపాటు దేశ విదేశాల్లో కూడా ఈ ఆస‌క్తిక‌ర చ‌ర్చ బాగా సాగుతోంది.

తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన కథను ఈ ఫ్రీక్వెల్‌లో చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా భూత కోలాకి సంబంధించి మరింత వివరంగా ఈ పార్ట్‌లో రిషబ్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.