Karimnagar | కరీంనగర్ లో ఈడీ దాడులు..
Karimnagar ప్రతిమ, చలిమెడ వైద్య విజ్ఞాన సంస్థలలో తనిఖీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల లావాదేవీల పై దృష్టి విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో మరోసారి ఈడి దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే అధికార పార్టీకి చెందిన పలువురు నేతల, కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఈడి మరోమారు పలు జిల్లాలలో ఏకకాలంలో దాడులు ఆరంభించింది. ఈడి అధికారులు 11 బృందాలుగా విడిపోయి ఈ దాడులు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నగునూర్ ప్రతిమ వైద్య, విద్యా విజ్ఞాన సంస్థతో […]

Karimnagar
- ప్రతిమ, చలిమెడ వైద్య విజ్ఞాన సంస్థలలో తనిఖీలు
- మేనేజ్మెంట్ కోటా సీట్ల లావాదేవీల పై దృష్టి
విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో మరోసారి ఈడి దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే అధికార పార్టీకి చెందిన పలువురు నేతల, కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఈడి మరోమారు పలు జిల్లాలలో ఏకకాలంలో దాడులు ఆరంభించింది. ఈడి అధికారులు 11 బృందాలుగా విడిపోయి ఈ దాడులు కొనసాగిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నగునూర్ ప్రతిమ వైద్య, విద్యా విజ్ఞాన సంస్థతో పాటు, బొమ్మకల్ చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మెడికల్ కళాశాలలో మేనేజ్ మెంట్ సీట్లకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.