Karimnagar | పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా: MLC జీవ‌న్‌రెడ్డి

Karimnagar పోలీసులు స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తే స్వాగతిస్తాం.. ఎన్నికల నియమావళి అమల్లోకి రానున్న తరుణంలో పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహం అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విధాత బ్యూరో, కరీంనగర్: ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో కలిసి పోలీసులు కార్యక్రమాలు నిర్వహించటంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం తన నివాసం, ఇందిరా భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి […]

Karimnagar | పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా: MLC జీవ‌న్‌రెడ్డి

Karimnagar

  • పోలీసులు స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తే స్వాగతిస్తాం..
  • ఎన్నికల నియమావళి అమల్లోకి రానున్న తరుణంలో పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహం
  • అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి..
  • కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

విధాత బ్యూరో, కరీంనగర్: ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో కలిసి పోలీసులు కార్యక్రమాలు నిర్వహించటంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం తన నివాసం, ఇందిరా భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ శాఖకు చెందిన వారైనా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించడంతో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎన్నికల్లో రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ ప్రధానమైనవని అన్నారు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ, పోలీసులు శాఖలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా ప్రజల్లో అపోహలు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసు శాఖ ప్రజా సంబంద కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమం, నిరుద్యోగులకు శిక్షణ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

అయితే ఎన్నికల నియామవళి అమలుకు రానున్న తరుణంలో అధికారుల బదిలీల ప్రక్రియ జరుగుతున్న సమయంలో పోలీసులు నిర్వహించే కార్యక్రమాలు, రాజకీయాలను ప్రభావితం చేయడం పై ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాజకీయాలను ప్రభావితం చేసేలా పోలీసులు, సోషల్ సర్వీస్ సంస్థతో కార్యక్రమం నిర్వహించడం నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎన్నడు చూడలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

స్వచంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టడం వారి హక్కు, సేవా కార్యక్రమాలు చేయవద్దని చెప్పడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే స్వచ్ఛందంగా సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడంపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవ‌న్నారు. సోషల్ ఆర్గనైజేషన్స్, రాజకీయాలకు అనుబంధంగా సంస్థలు రాజకీయాల్లో ప్రభావిత చేసే అవకాశం ఉందన్నారు.

రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా, నిష్పాక్షపాతంగా కంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఎన్నికల నియమావళి అమలుకు రాబోతున్న సమయంలో ధర్మపురి లో మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహ లత అధ్వర్యంలో కార్యక్రమాలు చేయడాన్ని తప్పుబట్టారు. రాజకీయాలను ప్రభావితం చేసే రాజకీయ అనుబంద సంస్థ ఎల్ ఎం కొప్పుల ఆర్గనైజేషన్ తో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆశ్చర్యకరమన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో పోలీసులు ఏ కార్య‌క్ర‌మాన్నైనా స్వతంత్రంగా నిర్వహించాలన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కు ఉద్యోగాల కల్పనను అభినందిస్తామన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం పక్షపాత ధోరణి తో వ్యవహరిస్తే అదుపు చేయాల్సిన బాధ్య‌త‌ జిల్లా స్థాయి అధికారి పై ఉంటుందన్నారు. జిల్లా స్థాయి అధికారి నియమాలను ఉల్లంఘించి, కింది స్థాయి అధికారులకు ఏవిధమైన సంకేతాలు ఇవ్వాలనుంకుంటున్నారని ప్రశ్నించారు.

తాము ఏది మాట్లాడిన లిఖిత పూర్వకంగా ఆధారాలతో మాట్లాడుతామన్నారు. త్వరలో మరో ఎపిసోడ్ విడుదల చేస్తామన్నారు. నియమాల ఉల్లంఘనలపై ఎన్నికల అధికారుల దృష్టి కి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ లో ప్రత్యేక విభాగం 24 గంటలు పని చేస్తోందన్నారు. ఉద్యోగులు నియమ నిబంధనలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమారు,పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, గాజంగి నందయ్య, కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, మన్సూర్, నేహాల్, చందా రాధాకిషన్, దరా రమేష్ బాబు, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బొల్లి శేఖర్, రఘువీర్ గౌడ్ మామిడిపల్లి మహిపాల్, బిరం రాజేష్, పాల్గొన్నారు.