Cobra | ప్లాస్టిక్ డ‌బ్బాను మింగేసిన నాగుపాము.. శ‌స్త్ర చికిత్స చేసి తొల‌గింపు

Cobra విధాత‌: ఓ నాగుపాము ఏకంగా ప్లాస్టిక్ డ‌బ్బానే మింగేసింది. దీంతో ఆ పాము ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పాములు ప‌ట్టే వ్య‌క్తి ఆ నాగుపామును గ‌మ‌నించి, వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్స్ నిర్వ‌హించ‌గా, పాము క‌డుపులో ప్లాస్టిక్ డ‌బ్బా ఉన్న‌ట్లు వైద్యులు గ‌మ‌నించారు. దీంతో పాముకు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, ప్లాస్టిక్ బాటిల్‌ను తొల‌గించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు స‌మీపంలోని బంట్వాళ‌లో నాగుపాము ఓ గుంత‌లో ఉండ‌టాన్ని స్నేక్ క్యాచ‌ర్ కిర‌ణ్ గ‌మ‌నించాడు. […]

Cobra | ప్లాస్టిక్ డ‌బ్బాను మింగేసిన నాగుపాము.. శ‌స్త్ర చికిత్స చేసి తొల‌గింపు

Cobra

విధాత‌: ఓ నాగుపాము ఏకంగా ప్లాస్టిక్ డ‌బ్బానే మింగేసింది. దీంతో ఆ పాము ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పాములు ప‌ట్టే వ్య‌క్తి ఆ నాగుపామును గ‌మ‌నించి, వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్స్ నిర్వ‌హించ‌గా, పాము క‌డుపులో ప్లాస్టిక్ డ‌బ్బా ఉన్న‌ట్లు వైద్యులు గ‌మ‌నించారు. దీంతో పాముకు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, ప్లాస్టిక్ బాటిల్‌ను తొల‌గించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు స‌మీపంలోని బంట్వాళ‌లో నాగుపాము ఓ గుంత‌లో ఉండ‌టాన్ని స్నేక్ క్యాచ‌ర్ కిర‌ణ్ గ‌మ‌నించాడు. అది క‌ద‌ల్లేని ప‌రిస్థితిలో ఉంది. దాని శ‌రీరంపై రెండు బ‌ల‌మైన గాయాలు ఉన్న‌ట్లు గుర్తించాడు. దీంతో ఆ పామును వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాడు స్నేక్ క్యాచ‌ర్.

అక్క‌డ పాముకు స్కానింగ్స్ నిర్వ‌హించ‌గా, దాని శ‌రీరంలో ప్లాస్టిక్ డ‌బ్బా ఉన్న‌ట్లు నిర్ధారించారు. దీంతో అన‌స్థీషియా ఇచ్చి జూన్ 4న పాముకు శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించి, ప్లాస్టిక్ డ‌బ్బాను తొల‌గించారు. పాముకు శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంత‌మైన‌ట్లు డాక్ట‌ర్ య‌శ‌శ్వి బృందం తెలిపింది.

అనంతరం 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు డాక్టర్ యశశ్వి తెలిపారు.