Karnataka Election | బీజేపీ మంత్రి ఆస్తులు రూ.1609కోట్లు..! నామినేషన్‌లో ప్రకటించిన నేత..!

Karnataka Election | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. మరో వైపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఆస్తులను వెల్లడించే విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రూ.1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. కర్ణాటకతో పాటు దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నేతల్లోనూ ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. బెంగళూరులోని హోసకోట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. […]

  • By: Vineela |    latest |    Published on : Apr 18, 2023 3:37 AM IST
Karnataka Election | బీజేపీ మంత్రి ఆస్తులు రూ.1609కోట్లు..! నామినేషన్‌లో ప్రకటించిన నేత..!

Karnataka Election |

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. మరో వైపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఆస్తులను వెల్లడించే విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రూ.1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు.

కర్ణాటకతో పాటు దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నేతల్లోనూ ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. బెంగళూరులోని హోసకోట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇక ఆయన భార్య గృహిణి కోగా.. శాంతకుమారి ఆస్తుల విలువ రూ.536కోట్లు. దంపతుల స్థిరాస్తుల విలువ రూ.1,073 కోట్లు. 2020 శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయన తన భార్యతో కలిసి రూ.1220 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో నాగరాజు తన మొత్తం అప్పులు రూ.98.36 కోట్లుగా ప్రకటించారు. నాగరాజు (72) 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆదాయ వనరులు వ్యవసాయం, ఇంటి ఆస్తి, వ్యాపారాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో నాగరాజు కాంగ్రెస్‌ అభ్యర్థి శరత్‌ బచ్చెగౌడ్‌తో తలపడనున్నారు.