ఇందిరా పార్కు వద్ద కర్నాటక రైతుల ధర్నా

కాంగ్రెస్ పాలనలో తమ రాష్ట్రంలో కరెంట్ సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ హైద్రాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్నకర్ణాటక రైతులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వివాదానికి దిగాయి

ఇందిరా పార్కు వద్ద కర్నాటక రైతుల ధర్నా
  • నిలదీసిన కాంగ్రెస్ శ్రేణులు


విధాత: కాంగ్రెస్ పాలనలో తమ రాష్ట్రంలో కరెంట్ సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ హైద్రాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్నకర్ణాటక రైతులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వివాదానికి దిగాయి.


నిజంగా మీకు కరెంటు సమస్యలుంటే కర్ణాటకలో ధర్నా చేయుకండా తెలంగాణ ఎన్నికల వేళ ఇక్కడికి వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారంటూ నిలదీశారు.


బీఆరెస్ పార్టీ ప్రోద్భలంతో ఆ పార్టీ రాజకీయంలో పావుగా మారి మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారంటూ వారిపై ఫైర్ అయ్యారు. ముషీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ధర్నాను అడ్డుకున్నారు.