Chicken Curry | కోడి కూర రుచిగా లేదని వాగ్వాదం.. కుమారుడిని చంపిన తండ్రి
Chicken Curry | కోడి కూర ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో వండిన కోడి కూర రుచిగా లేదని కుమారుడు తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన తండ్రి కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక( Karnataka )లోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కన్నడ( Dakshina Kannada )జిల్లాలోని గుత్తిగర్ గ్రామానికి చెందిన శివరామ్(32) అనే వ్యక్తి తన తండ్రి షీనాతో […]
Chicken Curry | కోడి కూర ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో వండిన కోడి కూర రుచిగా లేదని కుమారుడు తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన తండ్రి కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక( Karnataka )లోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కన్నడ( Dakshina Kannada )జిల్లాలోని గుత్తిగర్ గ్రామానికి చెందిన శివరామ్(32) అనే వ్యక్తి తన తండ్రి షీనాతో కలిసి ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి శివరామ్ ఇంట్లో కోడి కూర( Chicken Curry ) వండారు. రాత్రి ఇంటికి చేరుకున్న శివరామ్ భోజనం చేస్తూ కోడి కూర రుచిగా లేదని తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram