బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కర్ణాటక పోలీసుల సమన్లు

ముస్లిం కోటాపై బీజేపీ రూపొందించి, పోస్టు చేసిన వివాదాస్పద వీడియో కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు జారీ చేశారు. వారం రోజుల్లో తమ ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కర్ణాటక పోలీసుల సమన్లు

సోషల్‌ మీడియా వింగ్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయకు కూడా
వివాదాస్పద ముస్లిం కోటా వీడియో ఎఫెక్ట్‌

బెంగళూరు: ముస్లిం కోటాపై బీజేపీ రూపొందించి, పోస్టు చేసిన వివాదాస్పద వీడియో కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు జారీ చేశారు. వారం రోజుల్లో తమ ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. ఇదే కేసులో నడ్డా, మాలవీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై ఇప్పటికే బెంగళూరు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ప్రజాప్రాతినిథ్య చట్టం, ఐపీసీ 505 (2) సెక్షన్‌ కింద కేసులు బుక్‌ చేశారు.