Siddaramaiah | ప్రధాని మోదీని కలిసిన కాంగ్రెస్ సీఎం
Siddaramaiah సంప్రదాయ చెక్క ఏనుగు బహూకరణ మోదీని తొలిసారి కలిసిన సిద్ధరామయ్య విధాత: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఢిల్లీలోని సంసద్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. సంప్రదాయ చెక్కతో చేసిన ఏనుగు బొమ్మను మోదీకి బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు చర్చించారు. మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిద్ధరామయ్య ప్రధానితో భేటీ కావడం ఇదే తొలిసారి. […]

Siddaramaiah
- సంప్రదాయ చెక్క ఏనుగు బహూకరణ
- మోదీని తొలిసారి కలిసిన సిద్ధరామయ్య
విధాత: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఢిల్లీలోని సంసద్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. సంప్రదాయ చెక్కతో చేసిన ఏనుగు బొమ్మను మోదీకి బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.
మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిద్ధరామయ్య ప్రధానితో భేటీ కావడం ఇదే తొలిసారి. అనంతరం సిద్ధరామయ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా సమావేశమయ్యారు.
దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఎయిర్‌షో నిర్వహించాలని అభ్యర్థించారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు.