Kavya kalyan ram | నాగ చైత‌న్య గురించి.. బ‌ల‌గం హీరోయిన్ మ‌రీ అంత హాట్ కామెంట్స్ చేసిందేంటి..!

Kavya kalyan ram | అక్కినేని వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నాగ చైత‌న్య కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ సినిమా ఒక్క‌టి చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చైతూ సినిమా ఒక్క‌టి కూడా వంద కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. మంచి టాలెంట్ ఉన్న చైతూకి కనీసం ఒక్క పెద్ద హిట్ కూడా ప‌డ‌క‌పోవ‌డం అభిమానుల‌ని నిరాశ‌కి గురి చేస్తుంది. ఇటీవ‌ల క‌స్ట‌డీతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన చైతూ ఈ చిత్రంతో భారీ డిజాస్ట‌ర్ చ‌వి చూశాడు. ఇప్పుడు త‌న […]

  • Publish Date - August 23, 2023 / 01:53 AM IST

Kavya kalyan ram |

అక్కినేని వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నాగ చైత‌న్య కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ సినిమా ఒక్క‌టి చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చైతూ సినిమా ఒక్క‌టి కూడా వంద కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. మంచి టాలెంట్ ఉన్న చైతూకి కనీసం ఒక్క పెద్ద హిట్ కూడా ప‌డ‌క‌పోవ‌డం అభిమానుల‌ని నిరాశ‌కి గురి చేస్తుంది.

ఇటీవ‌ల క‌స్ట‌డీతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన చైతూ ఈ చిత్రంతో భారీ డిజాస్ట‌ర్ చ‌వి చూశాడు. ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాపై చాలా ఫోక‌స్ పెట్టాడు. అయితే నాగ చైత‌న్య గురించి బ‌ల‌గం బ్యూటీ హాట్ కామెంట్స్ చేయ‌డం ఇప్పుడు అంద‌రిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నా సెలబ్రిటీ క్రష్ నాగచైతన్య అంటూ హాట్ కామెంట్స్ చేయ‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారిన తేనెకళ్ల సుందరి కావ్య కళ్యాణ్ రామ్. ఈ అమ్మ‌డు గతంలో ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ బ‌ల‌గం సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమాతో కావ్యకి మంచి ఆఫ‌ర్స్ కూడా త‌లుపు త‌డుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసింది. తన ముద్దు పేరు అమ్ము అని అని, త‌న‌కు టైమ్ బాగా స్పెండ్ చేయగలిగే ప్రదేశం బీచ్ అని చెప్పుకొచ్చింది. ఇక తాను కూచిపుడి డ్యాన్సర్ ని అని కూడా స్ప‌ష్టం చేసింది. ఇంకో షాకింగ్ విష‌యం ఏంటంటే కావ్య‌.. జిల్లా స్థాయి వాలిబాల్ ప్లేయర్ కూడా.

ఇక త‌న‌కు ఇష్ట‌మైన హీరో ఎవ‌రు అని కావ్య‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, దానికి ఆమె నాగ చైత‌న్య పేరు చెప్పింది. నా సెలబ్రిటీ క్రష్ నాగచైతన్య అని, అత‌ను అంటే చాలా ఇష్ట‌మని పేర్కొంది. ఆయ‌న‌తో నటించే అవకాశం వస్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాన‌ని చెప్పింది.

త‌న‌కు ఇష్టమైన ఫుడ్ అన్నం, అవకాయ.. అని చెప్పిన కావ్య పరిస్థితులను, ఎమోషన్స్ ను సులువుగా అర్థం చేసుకోవడం ఆమె ప్ల‌స్ పాయింట్స్‌గా చెప్పుకొచ్చింది. కావ్య పుట్టింది భ‌ద్రాచ‌లం కొత్తగూడెంలో కాగా, పెరిగింది హైద‌రాబాద్‌లో. ఒక్క సినిమా స్టార్ హీరో సరసన పడితే ఈ అమ్మ‌డి ద‌శ కూడా తిరిగిపోవడం ఖాయంగా క‌నిపిస్తుంది.

Latest News