Revanth Reddy: కల్వకుంట్ల భూ మాఫియా.. ధన దాహానికి KBR పార్క్ బలి: రేవంత్‌రెడ్డి
మంత్రి డెవలపర్స్ ఇన్ని అంతస్తులా? ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎలా అనుమతించారు? సిటీని ధ్వంసం చేస్తున్న మంత్రి కేటీఆర్ ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రేవంత్ విధాత: తెలంగాణను రాజకీయంగా ధ్వంసం చేసిందే కాకుండా.. పర్యావరణాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిని విధ్వంసం చేయడాన్ని ఇకనైనా ఆపాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో కేబీఆర్ పార్కు వద్ద 2022లో భూమిలోపల […]

- మంత్రి డెవలపర్స్ ఇన్ని అంతస్తులా?
- ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎలా అనుమతించారు?
- సిటీని ధ్వంసం చేస్తున్న మంత్రి కేటీఆర్
- ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రేవంత్
విధాత: తెలంగాణను రాజకీయంగా ధ్వంసం చేసిందే కాకుండా.. పర్యావరణాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిని విధ్వంసం చేయడాన్ని ఇకనైనా ఆపాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో కేబీఆర్ పార్కు వద్ద 2022లో భూమిలోపల 3 అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. భూమి లోపల ఐదు అంతస్తులకు అనుమతించడం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు.
మంత్రి డెవలపర్స్ జుట్టు కేటీఆర్ చేతిలో ఉన్నదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అందుకే అందులో 2017లో వీర వెంకట రామారావు అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఆర్ డెవలపర్స్‌కు వాటా ఇప్పించారని ఆరోపించారు. మంత్రి డెవలపర్స్‌లో వీరు భాగస్వాములు అయ్యాక వేగంగా అనుమతులు వచ్చాయని విమర్శించారు. రాజయ్యను బర్తరఫ్ చేసినట్టు కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, అలా చేస్తేనైనా కేసీఆర్ కు పాప ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.
నగరానికి తలమానికం.. కేబీఆర్ పార్క్
కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక తలమానికమని రేవంత్ రెడ్డి అన్నారు. పార్కులో జాతీయ పక్షులతో పాటు విలువైన వృక్షాలు, వన్యప్రాణులు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వ సంపదగా కేబీఆర్ పార్కును కాపాడారని గుర్తు చేశారు. ఈ పార్కు తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద అని చెప్పారు. 16 మంది సీఎంలు కేబీఆర్ కఠిన నిబంధనలు పెట్టి పార్కును కాపాడారని తెలిపారు. 2006లో 5 ఎకరాల 30 గుంటల భూమిని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు కేటాయించారని, కానీ.. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నిబంధనలన్నీ తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేస్తున్నదని ఆరోపించారు.
భూమాఫియా కన్ను
2009లో మెటాస్ సంస్థ వాటాను ఐఎల్ఎంఎస్ సంస్థ కొనుగోలు చేసిందని, ఆ తరువాత బెంగళూరుకు చెందిన మంత్రి డెవలపర్స్ సంస్థ కొనుగోలు చేసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. 2012లో జీహెచ్ఎంసీ 3 అంతస్థులకే అనుమతించిందన్నారు. కానీ.. తెలంగాణ వచ్చాక ఈ భూమిపై భూ మాఫియా కన్ను పడిందని అన్నారు. 2016లో జీ ప్లస్ 7 కు అనుమతుల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇందుకు 2018లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. అయినా ధనదాహం తీరని సంస్థ.. మరిన్ని అంతస్థుల కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2022లో భూమిలోపల 3 అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు అనుమతించారని ఆరోపించారు. భూమి లోపల ఐదు అంతస్తులకు అనుమతించడం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు.
కేటీఆర్ చేతిలో మంత్రి డెవలపర్స్ జుట్టు
మంత్రి డెవలపర్స్ జుట్టు కేటీఆర్ చేతిలో ఉన్నదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అందుకే అందులో ఆర్ఎన్ఆర్ డెవలపర్స్‌కు వాటా ఇప్పించారని ఆరోపించారు. ఈ భవంతిలో 200 ఫ్లాట్స్ ఉన్నాయని, ఒక్కో ఫ్లాట్ 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నదన్న రేవంత్ రెడ్డి.. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 21కోట్లు పలుకుతోందని చెప్పారు. కేబీఆర్ పార్కుని ఆనుకుని ఉన్న స్థలంలో 15 అంతస్థులకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలని వాకర్స్ అసోసియేషన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ తన మిత్రుల కోసం, సత్యం రాజుల కోసం నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడ్డారు.
దోపిడీ కనిపించడం లేదా?
హెరిటేజ్ పై చర్చ వచ్చినపుడు అసెంబ్లీలో ఆనాడు సంపత్‌కుమార్‌ను కేసీఆర్ దబాయించారని, రాష్ట్రంలో ఏం జరిగినా తనకు తెలుస్తుందని అన్నారని గుర్తు చేసిన రేవంత్‌రెడ్డి.. జూబ్లీహిల్స్ సర్కిల్ లో జరిగే దోపిడీ కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు.
హైదరాబాద్‌ను ధ్వంసం చేస్తున్న కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని మంత్రి కేటీఆర్ ధ్వంసం చేస్తున్నారని, నగర చరిత్రను కనుమరుగు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మీ దోపిడీని ప్రజల ముందు పెడుతున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను విధ్వంసం చేసి హైదరాబాద్‌ను కాలుష్య నగరంగా మారుస్తున్నదని మండిపడ్డారు. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. దీనిపై హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలని కోరారు.
మంచిర్యాలలో నేడు సత్యాగ్రహం
రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా శుక్రవారం మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హజరయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.