Unemployment march: అవినీతి, లీకుల్లో కూరుకుపోయిన CM KCR కుటుంబం: BJP నేతలు
దమ్ముంటే KCR రాజీనామా చేయాలి BJP నేతలు లక్ష్మణ్, ఈటల, ప్రభాకర్ విమర్శ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కెసిఆర్ కుటుంబం మొత్తం అవినీతి పేపర్ లీకేజీల్లో కూరుకుపోయినా సోయి లేదని ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. శనివారం జరిగిన వరంగల్ నిరుద్యోగ మార్చ్ లో ఆయన ప్రసంగించారు. 30 లక్షల కుటుంబాలు గోస పడుతుంటే ముఖ్యమంత్రికి మాట్లాడడం వీలు కావడం లేదని విమర్శించారు. భరోసా ఇవ్వడానికి కూడా మనసు రావడం […]

- దమ్ముంటే KCR రాజీనామా చేయాలి
- BJP నేతలు లక్ష్మణ్, ఈటల, ప్రభాకర్ విమర్శ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కెసిఆర్ కుటుంబం మొత్తం అవినీతి పేపర్ లీకేజీల్లో కూరుకుపోయినా సోయి లేదని ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. శనివారం జరిగిన వరంగల్ నిరుద్యోగ మార్చ్ లో ఆయన ప్రసంగించారు. 30 లక్షల కుటుంబాలు గోస పడుతుంటే ముఖ్యమంత్రికి మాట్లాడడం వీలు కావడం లేదని విమర్శించారు. భరోసా ఇవ్వడానికి కూడా మనసు రావడం లేదన్నారు. KTR ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మీరెంత ప్రయత్నం చేసినా ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు.
దమ్ముంటే కేసీఆర్ రాజీనామా చేయాలి
మరో ఆరు నెలలు పోతే కేసీఆర్ ప్రభుత్వం గంగలో కలిసిపోతుందని బిజెపి నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జోష్యం చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే కెసిఆర్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగ మార్చ్‌లో ఆయన ప్రసంగించారు. తాము చెబితే వినే సిట్‌తో కాకుండా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు.. వారిపై ఆధారపడి కోటి 25 లక్షల మంది ఉంటే ఒక కెసిఆర్ కుటుంబానికి ఉద్యోగం లభించింది అని ఎద్దేవా చేశారు. పెళ్లిళ్లు కాక, ఉద్యోగాలు రాక, జీవితం పై విరక్తి చెంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే ముఖ్యమంత్రికి స్పందన లేదని విమర్శించారు. కాకతీయ, ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు రక్తాన్ని చిందించి, జైల్లోకి వెళ్లి ఉద్యమాలు చేస్తే ఆనాడు ఏమి చెప్పినావు? ఇప్పుడు ఏమి చేస్తున్నావ్? కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. ఆయన కుటుంబం దోచుకోవడానికి తెలంగాణను వినియోగించుకుంటున్నారని, సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఆ సాఫ్ట్‌వేర్ బండారం బయటపడుతుందని, నిరుద్యోగులకు ఇస్తానని చెప్పిన భృతి 3016 ఏమైందని ప్రశ్నించారు. ఒక్కో నిరుద్యోగికి 1,50,000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
లిక్కర్ రాణి, గ్రీకువీరుడు
గ్రీకువీరుడు నా రాకుమారుడు అంటూ అటు కొడుకును, ఇటు బిడ్డ లిక్కర్ రాణిని ఎలా రక్షించుకోవాలోననే ఆందోళనలో కేసీఆర్ ఉన్నాడంటూ మాజీ ఎమ్మెల్యే బిజెపి నేత ఎంవిఎస్ ప్రభాకర్ విమర్శించారు. దీనికోసం పనికిమాలిన మంత్రులు ఢిల్లీ టు హైదరాబాద్ చక్కెర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో గరికిపాటి మోహన్ రావు, చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, రావు పద్మ, ప్రేమేందర్ రెడ్డి, ధర్మారావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, శ్రీధర్, కుసుమ సతీష్ తదితరులు పాల్గొన్నారు.