Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ పనులకు ముహూర్తం ఖరారు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ పనులకు ముహూర్తం ఖరారు

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నిర్జల ఏకాదశి శుక్రవారం రోజున కర్రపూజతో గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. వరుసగా 71వ సంవత్సరం మహాగణపతిని ఖైరతాబాద్‌లో ప్రతిష్టంచబోతున్నారు. మూడు నెలల ముందే ప్రతి సంవత్సరం వినాయక విగ్రహ తయారీ పనులను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఆగస్ట్‌ 27న వినాయక చవితి ఉండటంతో జూన్‌ 6న సాయంత్రం 5 గంటలకు కర్ర పూజ నిర్వహించి పనులను ప్రారంభించనున్నారు.

1954లో మొదలైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఏటా విగ్రహం ఒక అడుగు పెరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహం ఎత్తును 20అడుగులకు పరిమితం చేశారు. గత ఏడాది ఉత్సవాలకు 70ఏళ్లు పూర్తయినందునా 70అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా గణేషుడి దర్శనమిచ్చారు. ఈ ఏడాది విగ్రహం ఎత్తు, పేరు ఇంకా ఖరారు చేయలేదు. మరి కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.