Ponnam Prabhakar| గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ ట్యాంక్ బండ్(Tank Bund) పై రేపు శనివారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం(Ganesh Immersion) శోభాయాత్రలకు చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి ..పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్(Khairatabad Ganesh) నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి.. వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రాంతాన్ని మరింత లోతుగా చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గత మూడు రోజులుగా జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. మంత్రి వెంట నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉన్నారు. కాగా పలువురు గణేష్ భక్తులు నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు కొడుతున్నారు.. వాహనాల అద్దాలు పగలగొడుతున్నారని..ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.