Kidney | విశాఖలో కలకలం.. కిడ్నీ కాజేసిన డాక్టర్
విధాత: విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయట పడింది. బలహీనుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారి అంతర్గత అవయవాలకు బేరం కుదిర్చి, మారు బేరానికి అమ్మేసిన గ్యాంగ్ గుట్టు బయటపడింది. ఒప్పందం మేరకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన డాక్టర్, మరో మధ్యవర్తి మీద బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. విశాఖ వాంబే కాలనీకి చెందిన టాక్సీ డ్రైవర్ ఆర్థిక సమస్యలతో తన కిడ్నీ అమ్మేసెందుకు సిద్ధమయ్యారు. విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం […]

విధాత: విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయట పడింది. బలహీనుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారి అంతర్గత అవయవాలకు బేరం కుదిర్చి, మారు బేరానికి అమ్మేసిన గ్యాంగ్ గుట్టు బయటపడింది.
ఒప్పందం మేరకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన డాక్టర్, మరో మధ్యవర్తి మీద బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. విశాఖ వాంబే కాలనీకి చెందిన టాక్సీ డ్రైవర్ ఆర్థిక సమస్యలతో తన కిడ్నీ అమ్మేసెందుకు సిద్ధమయ్యారు.
విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం . పెందుర్తి తిరుమల హాస్పిటల్ లో వినయ్ కుమార్ అనే యువకుడి కిడ్నీ తీసి రూ. 8.50 లక్షలు ఇస్తామంటూ ఆశ చూపి పరారైన బ్రోకర్లు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/kEK9WdtiCi
— Vizag News Man (@VizagNewsman) April 27, 2023
దీనికి కామరాజు అనే మధ్యవర్తి ద్వారా ఎనిమిదిన్నర లక్షలు వచ్చేలా బేరం కుదిరింది. అయితే రెండున్నర లక్షలు ఇచ్చి కిడ్నీ(Kidney) తీసుకుని మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి కిడ్నీ ఇవ్వడానికి అడ్వాన్స్ తీసుకున్న వినయ్ కుమార్ విషయం కుటుంబీకులకు తెలిసి ఆయన్ను వద్దని వారించగా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.
విశాఖ కిడ్ని రాకెట్ కేసులో బాదితుడు వినయ్ కుమార్ కు న్యాయం చేయ్యలంటూ వాంబే కాలనీ రోడ్డుపై బైఠాయించిన కాలనీ వాసులు. కలెక్టర్ రావాలి కుటుంబాన్ని అదుకోవాలని డిమాండ్. కెజిహెచ్ కు బాదితుడు వినయ్ ను పంపించమంటూ పట్టు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/7t8DuTHgfx
— Vizag News Man (@VizagNewsman) April 27, 2023
అయితే ఆల్రెడీ అటు మారు బేరం సెట్ చేసుకున్న కామరాజు తన ఆదాయం పోతుందన్న బాధతో వినయ్ కుమార్ ను కిడ్నాప్ చేసి పెందుర్తిలోని తిరుమల ఆస్పత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ పరమేశ్వర రావు సారథ్యంలో కిడ్నీ బలవంతంగా తొలగించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
అసలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం అవయవాల మార్పిడి చాలా పెద్ద నేరం. మరి ఈ పరమేశ్వర రావు, తనది కాని సబ్జెక్టులో ఎలా దూరారు. వేరే డాక్టర్ ను రప్పించి ఇలా కిడ్నీ లాగేశారా.. ఇంతకుముందు కూడా ఇలాంటివి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేదలకు డబ్బు ఎర..కిడ్నీలు కాజేస్తున్న ముఠాలు – TV9#tv9telugu #vishakapatnam #kidneyracket pic.twitter.com/2k7oVEvCDn
— TV9 Telugu (@TV9Telugu) April 27, 2023