Kim Jong Un | రష్యాలో.. కిమ్ కూర్చునే కుర్చీకి కూడా రేడియేషన్ చెకింగ్
Kim Jong Un తమ బంధాన్ని చాటి చెప్పాలని ప్రయత్నించిన పుతిన్, కిమ్ విధాత: రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ల భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కిమ్ ప్రయాణించే ట్రైన్ దగ్గరి నుంచి అతడి భద్రతా ఏర్పట్లను అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ భేటీలో కిమ్‌కు కేటాయించిన కుర్చీని కూడా అతడి వ్యక్తిగత సిబ్బంది ఎంతో క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. […]

Kim Jong Un
- తమ బంధాన్ని చాటి చెప్పాలని ప్రయత్నించిన పుతిన్, కిమ్
విధాత: రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ల భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కిమ్ ప్రయాణించే ట్రైన్ దగ్గరి నుంచి అతడి భద్రతా ఏర్పట్లను అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ భేటీలో కిమ్‌కు కేటాయించిన కుర్చీని కూడా అతడి వ్యక్తిగత సిబ్బంది ఎంతో క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. ముందుగా అతడి సిబ్బంది ఒకరు కుర్చీని చేతులతో పట్టుకుని పరీక్షించారు. అనంతరం ఒక పరికరంతో రేడియేషన్ చెక్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని కథనాల ప్రకారం.. ఆ కుర్చీ కిమ్ బరువును తట్టుకుందా లేదా అని కూడా సిబ్బంది పరీక్షించినట్లు తెలుస్తోంది.
Russia