Kim Jong Un | పుతిన్ విమానం కన్నా ఈ రైలే అత్యంత సురక్షితం.. కిమ్ ప్రయాణించే ట్రైన్ విశేషాలివి..
Kim Jong Un విధాత: అతి అరుదుగా విదేశాలకు వెళ్లే ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా రష్యాకు పయనమయ్యారు. తన ప్రత్యేక ప్రైవేట్ రైలులో ఆయన రష్యాలోని వ్లాదివొస్తోక్ ప్రాంతానికి వెళ్లనున్నారు. 1,180 కి.మీటర్ల ఈ ప్రయాణం సుమారు 20 గంటల పాటు సాగనుంది. ఈ పర్యటన వార్తలతో కిమ్ (Kim Jong Un) ప్రయాణ సాధనాలపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలయింది. అసలు ఆ రైలు ప్రత్యేకత ఏంటి? […]

Kim Jong Un
విధాత: అతి అరుదుగా విదేశాలకు వెళ్లే ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా రష్యాకు పయనమయ్యారు. తన ప్రత్యేక ప్రైవేట్ రైలులో ఆయన రష్యాలోని వ్లాదివొస్తోక్ ప్రాంతానికి వెళ్లనున్నారు. 1,180 కి.మీటర్ల ఈ ప్రయాణం సుమారు 20 గంటల పాటు సాగనుంది.
ఈ పర్యటన వార్తలతో కిమ్ (Kim Jong Un) ప్రయాణ సాధనాలపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలయింది. అసలు ఆ రైలు ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఉత్తర కొరియా అధ్యక్షులు ఎక్కువగా దీనినే ఉపయోగిస్తారు అనే అంశాలను పరిశీలిస్తే..
ఇవీ రైలు ప్రత్యేకతలు
ఉత్తరకొరియా అధ్యక్షుడి ప్రైవేటు రైలు పేరు తాయంగో.. అంటే సూర్యుడని అర్థం. అంతే కాకుండా తమ దేశ నిర్మాత కిమ్ 2 బిరుదు కూడా అదే. ఈ రైలు (Kim Train) అత్యంత శత్రు దుర్భేధ్యంగా ఉంటూ.. అనేక ఆయుధాలను తనతో మోసుకెళుతుంది.
బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు కూడా ఉండటంతో అత్యంత బరువుతో ఉంటుంది. అందుకే నింపాదిగా గంటకు 50 కి.మీ. గరిష్ఠ వేగంతో మాత్రమే ఇది ప్రయాణిస్తుంది. ఈ రైలు మార్గాన్ని కిమ్ వ్యక్తిగత సిబ్బంది ముందుగానే జల్లెడ పడతారు. ఆ మార్గంలో బాంబులు, అడ్డంకులు ఏమీ లేవని క్లియరెన్స్ వచ్చాకనే రైలు ముందుకు వెళుతూ ఉంటుంది.
2001లో కిమ్ తండ్రి కిమ్ జాంగ్ 2 ఈ రైలులో 10 రోజుల పాటు ప్రయాణించి మాస్కోకు చేరుకున్నారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ రైలు గురించి రష్యన్ మిలటరీ కమాండర్ కాన్‌స్టాంటెన్ పులికోవ్‌స్కీ తన అనుభవాలలో వివరించారు.
ఈ రైలులో కొరియన్, రష్యన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్ వంటకాలను ఎప్పుడైనా ఆర్డర్ చేయొచ్చు. అంతే కాదు బతికిఉన్న సముద్రపీతలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కిమ్ కోరిన తక్షణం చెఫ్ వాటితో విందు సిద్ధం చేస్తారు.
Kim Jong Un đến Vladivostok là một diễn biến hợp lý chuyển đổi nước nga như Bắc Hàn và Iran.
Mọi việc đã sắp xếp rồi , nga cần vũ khí , đặc biệt là T-55 của nga .Putin sẽ nhượng bộ cho Bắc Hàn về hoả tiển và hạt nhân của nước này. https://t.co/o5IIKJ4fr0— Thanh Lam Nguyen (@ThanhLa25931971) September 12, 2023
నా అనుభవం ప్రకారం.. రష్యా అధ్యక్షడి విమానం కూడా కిమ్ రైలుకు సరితూగలేదు అని ఆయన అభివర్ణించారు. కిమ్ తాతగారు, ఉత్తర కొరియా జాతిపిత కిమ్ 2 ఈ విదేశీ రైలు ప్రయాణాలను ప్రారంభించారు. విమాన ప్రయాణాల పట్ల ఆయనకున్న భయమే ఈ నిర్ణయానికి కారణమని చెబుతారు.
దక్షిణాసియాలో ఉన్న వియత్నాం, తూర్పు యూరప్‌లకు కూడా ఈ రైలులోనే విదేశీ పర్యటనలు చేశారు. విదేశాలకు చేరుకున్నాక కూడా కిమ్ అక్కడి వాహనాలలో ప్రయాణించరు. రైలుతో పాటే మెర్సిడెస్ బెంజ్ ఎస్ మోడల్‌ను సిబ్బంది తీసుకొస్తారు. దాంట్లోనే కిమ్ విదేశీ నగరాల్లో ఒక చోటు నుంచి మరో చోటకి వెళతారు.
ఇవే కాకుండా కిమ్‌కు ఓ విమానం కూడా ఉంది. సోవియట్ కాలంలో తయారైన ఈ విమానం పేరు ఇల్యూనిష్ 62. అతి అరుదుగా ఇందులో ఆయన విదేశాలకు ప్రయాణిస్తారు. చివరి సారి 2018లో చైనా నగరం డాలియన్‌కు విమానంలో చేరుకున్నారు.
స్వదేశాల్లో కిమ్‌కు ప్రత్యేకమైన బస్సులు, బోట్లు కూడా ఉంటాయని విదేశీ మీడియా పలు కథనాలు ఇస్తూ ఉంటుంది. కొరియాకు ఎగుమతులపై ఆంక్షలు ఉన్నా ఇటీవలే ఒక అత్యంత అధునాతమైన, ఖరీదైన యాచ్‌ను ఆయన దిగుమతి చేసుకున్నారని కొన్ని వార్తలు వెలువడ్డాయి.