ప్రజలను హడలెత్తించిన.. భారీ కింగ్ కోబ్రాలు
విధాత: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కుమ్మరినౌగాం గ్రామంలో 13 అడుగుల కింగ్‌కోబ్రా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి అతి సమీపంలో కింగ్ కోబ్రా తిరుగుతుండడాన్ని స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమీప గ్రామమైన సోంపేట నివాసి పాములు పట్టే బాలరాజుకు సమాచారం అందించడంతో అతను వచ్చి చాకచక్యగా కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఆతరువాత అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారుల సూచన మేరకు గ్రామస్థులు కింగ్ కోబ్రాను సమీప అటవీ ప్రాంతంలో వదిలారు. […]
విధాత: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కుమ్మరినౌగాం గ్రామంలో 13 అడుగుల కింగ్‌కోబ్రా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి అతి సమీపంలో కింగ్ కోబ్రా తిరుగుతుండడాన్ని స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు.
వెంటనే సమీప గ్రామమైన సోంపేట నివాసి పాములు పట్టే బాలరాజుకు సమాచారం అందించడంతో అతను వచ్చి చాకచక్యగా కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఆతరువాత అటవీ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ అధికారుల సూచన మేరకు గ్రామస్థులు కింగ్ కోబ్రాను సమీప అటవీ ప్రాంతంలో వదిలారు. అయితే ఈ మండల పరిధిలోని జలంత్ర కోట, బొగాబెణి తదితర ప్రాంతాల్లో తరచూ కింగ్ కోబ్రాలు సంచరిస్తున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సలహా ఇచ్చారు.
అయితే ఇదే జిల్లాలోని సోంపేట గ్రామంలోని జింకిభద్ర కాలనీలో ఓ ఇంటి ముందు రెండు రోజుల కిత్రం 12 అడుగుల పాము హల్ చల్ చేసింది. దీంతో ఆ పామును స్నేక్ క్యాచర్ బాలరాజు చాకచక్యంగా ఆ పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిశారు. అయితే 12 అడుగులు ఉన్న ఈపాము 10కిలోల బరువు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram