Tiger | మాచర్ల-ఎర్రగొండపాలెం రహదారిలో.. పెద్ద పులి సంచారం
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య పెరిగిపోతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు బాగా సంచరిస్తున్నాయి. ఎక్కడి పడితే అక్కడ దర్శనమిస్తూ.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి పెద్ద పులులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మాచర్ల - ఎర్రగొండపాలెం రహదారిలో ఓ పెద్ద పులి కనిపించింది. అర్ధరాత్రి వేళ.. భయంకరమైన గాండ్రింపులు చేస్తూ పులి రోడ్డుపై కనిపించింది. ఈ దృశ్యాన్ని వాహనదారులు తమ మొబైల్స్‌లో బంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram