Kodada | కోదాడ నియోజకవర్గంలోకి భట్టి పాదయాత్ర.. స్వాగతం పలికిన పద్మావతిఉత్తమ్
Kodada ఆకట్టుకున్న గద్దర్ ఆటాపాట విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు మంగళవారం రాత్రి నామవరం గేట్ వద్ద కోదాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భట్టి పాదయాత్ర కు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎదురేగి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, స్థానిక ప్రజలతో కలిసి ఘన స్వాగతం పలికారు. మహిళలు భట్టి పాదయాత్రకు మంగళహారతులు పట్టారు. పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో జాతీయ రహదారి క్రిక్కిరిసింది. […]
Kodada
- ఆకట్టుకున్న గద్దర్ ఆటాపాట
విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు మంగళవారం రాత్రి
నామవరం గేట్ వద్ద కోదాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భట్టి పాదయాత్ర కు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎదురేగి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, స్థానిక ప్రజలతో కలిసి ఘన స్వాగతం పలికారు.
మహిళలు భట్టి పాదయాత్రకు మంగళహారతులు పట్టారు. పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన
ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో జాతీయ రహదారి క్రిక్కిరిసింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలతో కలిసి భట్టి పాదయాత్ర కోదాడ నియోజకవర్గం లో ముందుకు సాగుతుంది.
పాదయాత్రలో ప్రజా గాయకుడు గద్దర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఆటపాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గద్ధర్ పాదయాత్రలో పాల్గొన్న ప్రజలతో కెసిఆర్ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ ప్రతిజ్ఞ చేయించడం విశేషం. ఈ సందర్భంగా భట్టి పాదయాత్ర పై గద్దర్ ప్రత్యేకంగా రాసిన పాటలు పాడి కేసీఆర్ ప్రభుత్వం పై ఓట్ల యుద్ధం చేయాలనీ పిలుపునిచ్చారు.
పాదయాత్రలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తో పాటు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram