Konda Visveshwar Reddy | బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వాఖ్యలు

Konda Visveshwar Reddy బీజేపీ నేత కొండా సంచలన వాఖ్యలు విధాత: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని ప్రజలంతా అనుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం ఖాయమని ప్రజలంతా అనుకున్నారని, కవిత అరెస్ట్ కాకపోవడంతో ఏదో అవగాహన ఒప్పందం ఉందని అందరూ అనుకుంటున్నారన్నారు. దీని వల్లే బీజేపీ ఉదృతికి బ్రేకులు పడ్డాయని.. అందుకే పొంగులేటి […]

Konda Visveshwar Reddy  | బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వాఖ్యలు

Konda Visveshwar Reddy

  • బీజేపీ నేత కొండా సంచలన వాఖ్యలు

విధాత: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని ప్రజలంతా అనుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం ఖాయమని ప్రజలంతా అనుకున్నారని, కవిత అరెస్ట్ కాకపోవడంతో ఏదో అవగాహన ఒప్పందం ఉందని అందరూ అనుకుంటున్నారన్నారు.

దీని వల్లే బీజేపీ ఉదృతికి బ్రేకులు పడ్డాయని.. అందుకే పొంగులేటి శ్రీ నివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతల చేరికలు ఆగిపోయాయన్నారు. తెలంగాణ బీజేపీలో విచిత్ర సంకట స్థితి నెలకొన్నదన్నారు.

ఈటల రాజేందర్‌తో కలిసి కొంత మంది కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్నదని ఇందులో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో మరోకొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తే కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారని కొండా అన్నారు.