Krithi Shetty | ఒక వైపు హిట్టు లేదు.. మరో వైపు అతని టార్చర్.. ఎలా వేగుతుందో పాపం!
Krithi Shetty విధాత: ‘ఉప్పెన’ ఊపు తర్వాత కృతిశెట్టి చేసిన సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. మొదటి హిట్‌తో ఇంతకాలం హీరోయిన్గా నెట్టుకొస్తున్న కృతిశెట్టికి ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ వంటి సినిమాలు కూడా.. హిట్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుత వరుస ఫ్లాప్స్‌లో ఉన్న కృతిశెట్టికి ఐరెన్ లెగ్ ట్యాగ్ కూడా వేసేశారు. పాపం టాలీవుడ్లో సరైన హిట్ పడక అమ్మడు తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లి.. అక్కడ లక్‌ని పరీక్షించుకుంటోంది. అక్కడ స్టార్ హీరోలైన కార్తీ, సూర్యలతో […]

Krithi Shetty
విధాత: ‘ఉప్పెన’ ఊపు తర్వాత కృతిశెట్టి చేసిన సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. మొదటి హిట్‌తో ఇంతకాలం హీరోయిన్గా నెట్టుకొస్తున్న కృతిశెట్టికి ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ వంటి సినిమాలు కూడా.. హిట్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుత వరుస ఫ్లాప్స్‌లో ఉన్న కృతిశెట్టికి ఐరెన్ లెగ్ ట్యాగ్ కూడా వేసేశారు. పాపం టాలీవుడ్లో సరైన హిట్ పడక అమ్మడు తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లి.. అక్కడ లక్‌ని పరీక్షించుకుంటోంది. అక్కడ స్టార్ హీరోలైన కార్తీ, సూర్యలతో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అవకాశాల పరంగా కోలీవుడ్‌లో అమ్మడి పరిస్థితి బాగానే ఉంది కానీ.. హిట్ సంగతే తేలడం లేదు.
ఇప్పుడున్న ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే కొంతకాలం మనుగడ ఉంటుందనేది ఇప్పటికే ఎందరో హీరోయిన్ల విషయంలో రివీలైంది. ఇప్పుడు హిట్టు పడితేనే కృతిశెట్టి కూడా కొంతకాలం మనుగడ సాధిస్తుంది. ఇప్పుడు అర్జెంట్‌గా ఆమెకు హిట్టు కావాలి. అయితే ఒకవైపు హిట్టు కోసం ఆమె నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు ఆమెని ఓ స్టార్ హీరో కొడుకు టార్చర్ చేస్తున్నాడట.
కాస్త అందం, అమాయకంగా కనిపించే కృతిశెట్టికి ఓ స్టార్ హీరో కుమారుడితో సమస్యలు మొదలయ్యాయట. సినీ తారలంటే ఇట్టే వలలో పడిపోతారనే అభిప్రాయం వల్లనో ఏమో.. అతగాడు కృతితో చనువుగా ఉండి, ఆమె స్నేహాన్ని సంపాదించాలని చూస్తుంటే, తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసిందట.
అలా చెప్పినా వదలకుండా కృతి వెనకపడి ఆమె ఎక్కడికి వెళితే అక్కడకు వెళ్ళి మరీ విసిగిస్తున్నాడట సదరు స్టార్ కొడుకు. తన పుట్టిన రోజు ఫంక్షన్‌కి షూటింగ్ మానేసి వచ్చి తీరాలని, దానికి ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానని ఆఫర్ చేశాడట. తనతో టైం స్పెండ్ చేయాలని బలవంతం చేస్తూ.. టార్చర్ పెడుతున్నాడని ఓ ఇంటర్వ్యూలో కృతి తన గోడు వెల్లబోసుకుందని అంటున్నారు.
దీంతో ఆ స్టార్ హీరో కొడుకు ఎవరా అని అంతా ఇంటరాగేషన్ చేస్తున్నారు. అయితే నిజంగానే స్టార్ హీరో కొడుకు అలా చేస్తున్నాడా? లేక కొన్ని రోజులు వార్తలలో ఉండాలని ఇలా చేసిందో తెలియదు కానీ.. కృతి కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అవుతున్నాయి.
ఇంత క్యూట్‌గా కనబడే కృతి వెనుక ఇంత కష్టం ఉందా? ఈ పరిస్థితుల్లో ఎలా వేగుతుందో, ఎలా నెట్టుకొస్తుందో.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమె కామెంట్స్ తర్వాత ఆ స్టార్ హీరో కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో.. కృతి ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో.. అంటూ ఆమెపై జాలి చూపే వారు కూడా లేకపోలేదు.