ప్రమాణ స్వీకారానికి మరొక రోజు వస్తా: కేటీఆర్‌

శాసన సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు మరొక రోజు వస్తానని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు శాసన సభ కార్యదర్శికి సమాచారం అందించారు

ప్రమాణ స్వీకారానికి మరొక రోజు వస్తా: కేటీఆర్‌

విధాత: శాసన సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు మరొక రోజు వస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు శాసన సభ కార్యదర్శికి సమాచారం అందించారు. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ వెంట తాను ఆసుపత్రిలో ఉన్నానని, అందుకే ఈ రోజు శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోతున్నానని, మరొక రోజు సమయం కావాలంటూ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో జారీపడి తుంటి ఎముక విరగడంతో ఆయనకు యశోధ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. దీంతో అటు కేసీఆర్ తో పాటు ఆసుపత్రిలో తండ్రికి సహాయంగా ఉండటంతో కేటీఆర్ కూడా శనివారం ప్రొటెం స్పీకర్ ముందు జరిగిన ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోయారు.