Kunamneni Sambasiva Rao | వచ్చే ఎన్నికల్లో మోడీకి ఎదురీతే: కూనంనేని

Kunamneni Sambasiva Rao విధాత: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన నరేంద్రమోడీకి, బీజేపీ పార్టీకి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవ్వక తప్పదని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల సైతం మోడీ వెంట లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైద‌రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల చొరవతోనే యూపీఏ కూటమి పేరు ఇండియా కూటమిగా మారిందన్నారు. బీజేపీ సైద్ధాంతిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు క్రియాశీలకంగా సాగుతారన్నారు. బీజేపీ తమ […]

  • By: Somu |    latest |    Published on : Jul 19, 2023 1:37 AM IST
Kunamneni Sambasiva Rao | వచ్చే ఎన్నికల్లో మోడీకి ఎదురీతే: కూనంనేని

Kunamneni Sambasiva Rao

విధాత: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన నరేంద్రమోడీకి, బీజేపీ పార్టీకి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవ్వక తప్పదని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల సైతం మోడీ వెంట లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

హైద‌రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల చొరవతోనే యూపీఏ కూటమి పేరు ఇండియా కూటమిగా మారిందన్నారు. బీజేపీ సైద్ధాంతిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు క్రియాశీలకంగా సాగుతారన్నారు.

బీజేపీ తమ అలయెన్స్ పార్టీల పేరుతో కూటమి సమావేశాలు నిర్వహిస్తే దేశం కోసమని, ప్రతిపక్షాల కూటమి సమావేశాలు పెడితే కుటుంబం కోసమంటు మోడీ మాట్లాడటం ఆయన సంకుచిత వైఖరికి నిదర్శనమన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు, కర్నాటక ఫలితాలను ప్రభావితం చేశాయని భావిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి కమ్యూనిస్టులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాయన్నారు.