Land Registration | మనువడికి భూమి రిజిస్ట్రేషన్‌కు వచ్చి ప్రాణాలొదిలిన తాతా

Land Registration విధాత: తన పేరిట ఉన్న భూమిని తన మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వచ్చిన తాతా ఆకస్మికంగా మృతి చెందిన విషాధ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదానికి గురి చేసింది. మునుగోడు మండలం ఇప్పర్తికి చెందిన మహేశ్వరం పెద్ద నరసింహ(80) తన పేరు మీద ఉన్న 32గుంటల భూమిని తన పెద్ద కుమారుడి కొడుకుకు రిజిస్ట్రేషన్ చేసేందుకు సోమవారం మద్యాహ్నాం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. రిజిస్ట్రార్ వద్ద సంతకం చేస్తుండగానే […]

Land Registration | మనువడికి భూమి రిజిస్ట్రేషన్‌కు వచ్చి ప్రాణాలొదిలిన తాతా

Land Registration

విధాత: తన పేరిట ఉన్న భూమిని తన మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వచ్చిన తాతా ఆకస్మికంగా మృతి చెందిన విషాధ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదానికి గురి చేసింది. మునుగోడు మండలం ఇప్పర్తికి చెందిన మహేశ్వరం పెద్ద నరసింహ(80) తన పేరు మీద ఉన్న 32గుంటల భూమిని తన పెద్ద కుమారుడి కొడుకుకు రిజిస్ట్రేషన్ చేసేందుకు సోమవారం మద్యాహ్నాం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు.

రిజిస్ట్రార్ వద్ద సంతకం చేస్తుండగానే ఒక్కసారిగా నరసింహ స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అతడిని చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకెళ్లగా అప్పటికే అతను చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. అనుకోని ఈ ఘటనతో నరసింహ కుటుంబం దుఃఖంలో మునిగింది.