తిరుపతి జూ పార్కులో దారుణం.. వ్యక్తిని హతమార్చిన సింహం
తిరుపతి జూ పార్కులో సింహాల ఎన్‌క్లోజర్ జోన్‌లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపేసింది. ఈ ఘటన జూ పార్కు సందర్శకులలో భయాందోళనలు రేకెత్తించింది
- ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
విధాత : తిరుపతి జూ పార్కులో సింహాల ఎన్‌క్లోజర్ జోన్‌లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపేసింది. ఈ ఘటన జూ పార్కు సందర్శకులలో భయాందోళనలు రేకెత్తించింది. వెంటనే జూ క్యూరెటర్లు సందర్శకులను అప్రమత్తం చేశారు. జూ పార్కులోకి సందర్శకుల రాకను నిలిపివేశారు.
సెల్ఫీ తీసుకునేందుకు సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి సింహం గర్జనలకు భయపడి చెట్టు ఎక్కినప్పటికి అదుపు తప్పి కింద పడ్డాడు. వెంటనే సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. సింహాన్ని అక్కడి నుంచి తరిమేసి మృతదేహాన్నిబయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఇదే జూపార్కులో బ్యాటరీ వాహనం ఢీ కొని ఓ బాలుడు కూడా మృతి చెందాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram