Pakistan Announce T20 WC Squad : ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్‌ జట్టు ప్రకటన

ఐసీసీ హెచ్చరికల ప్రచారం మధ్య పాక్‌ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15 మంది ఎంపికయ్యారు.

Pakistan Announce T20 WC Squad : ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్‌ జట్టు ప్రకటన

విధాత : భారత్, శ్రీలంక వేదికగా ఫిభ్రవరి 7నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ మెగాటోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సల్మాన్‌ అలీ అఘా సారథ్యంలో 15 మందితో జట్టును ప్రకటించింది. బాబర్‌ ఆజం, షాహిన్‌ అఫ్రిదీ, అబ్రార్ హమీద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకార్ జమాన్, ఖవాజ్ మహ్మద్ నఫీయా, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నజీమ్ షా, షాబ్రాద్ ఫర్హాన్, సయిమ్ అయూబ్, షోయబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్ లు జట్టుకు ఎంపికయ్యారు.

ఇటీవల పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నఖ్వి టీ 20వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ను తప్పించడం అన్యాయం అని, ఈ టోర్నీలో తమ జట్టు పాల్గొనడంపై మా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని వ్యాఖ్యానించాడు. దీంతో బంగ్లా బాటలోనే పాక్ కూడా టీ 20వరల్డ్ కప్ నుంచి వైదొలుగుతుందని భావించారు. ఈ క్రమంలో పాక్ బోర్డుపై ఐసీసీ ఆంక్షల కొరడా ఝళిపిస్తుందని వార్తలు వెలువడ్డాయి. ఐసీసీ ఆంక్షల ప్రచారం నేపథ్యంలో పాక్‌ బోర్డు తమ జట్టును ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Harish Rao : సింగరేణి అక్రమాలపై భట్టి వ్యాఖ్యలు పెద్ద జోక్

CM MK Stalin : తమిళనాడులో హిందీకి ఎప్పటికి స్థానం ఉండదు